IND vs USA: టాస్ గెలిచిన టీమిండియా.. దూబేకు మరో ఛాన్స్.. తుదిజట్లు ఇలా-ind vs usa t20 world cup 2024 team india won the toss against america usa vs ind toss update ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Usa: టాస్ గెలిచిన టీమిండియా.. దూబేకు మరో ఛాన్స్.. తుదిజట్లు ఇలా

IND vs USA: టాస్ గెలిచిన టీమిండియా.. దూబేకు మరో ఛాన్స్.. తుదిజట్లు ఇలా

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 12, 2024 07:49 PM IST

IND vs USA T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍లో జోష్ మీద ఉన్న టీమిండియా.. అమెరికాతో పోరు షురూ చేసింది. ఈ మ్యాచ్ గెలిస్తే ఇక సూపర్-8 చేరుతుంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచింది భారత్.

IND vs USA: టాస్ గెలిచిన టీమిండియా.. దూబేకు మరో ఛాన్స్.. తుదిజట్లు ఇలా
IND vs USA: టాస్ గెలిచిన టీమిండియా.. దూబేకు మరో ఛాన్స్.. తుదిజట్లు ఇలా (Getty Images via AFP)

IND vs USA: టీ20 ప్రపంచకప్‍ 2024 టోర్నీలో తొలి రెండు మ్యాచ్‍లు గెలిచి అదరగొట్టింది భారత్. ఆల్‍రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపింది. ప్రపంచకప్ గ్రూప్-ఏలో న్యూయార్క్ వేదికగా నేడు (జూన్ 12) ఆతిథ్య అమెరికాతో టీమిండియా తలపడుతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే సూపర్-8కు అర్హత సాధిస్తుంది. అమెరికా కూడా రెండు మ్యాచ్‍ల్లో గెలిచి ఫామ్‍లో ఉంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. దీంతో అమెరికా తొలుత బ్యాటింగ్ చేయనుంది.

దూబేకు మరో ఛాన్స్

ప్రపంచకప్ తొలి రెండు మ్యాచ్‍ల్లో విఫలమైన శివమ్ దూబేను అమెరికాతో మ్యాచ్‍‍లో భారత్ తప్పిస్తుందనే అంచనాలు వచ్చాయి. అయితే, టీమిండియా మేనేజ్‍మెంట్ దూబేపై నమ్మకాన్ని కొనసాగించింది. ఈ మ్యాచ్‍కు కూడా తుదిజట్టులో కొనసాగించింది. గత మ్యాచ్‍ జట్టును కంటిన్యూ చేసింది. ఎలాంటి మార్పులు చేయలేదు.

కెప్టెన్‍గా జోన్స్

తుదిజట్టులో రెండు ఛేంజెస్ చేసింది అమెరికా. మోనాంక్ పటేల్ స్థానంలో షయాన్ జహంగీర్‌ను తీసుకుంది. గత రెండు మ్యాచ్‍లకు కెప్టెన్సీ చేసిన మోనాంక్ గాయం వల్ల దూరమవడం అమెరికాకు ఎదురుదెబ్బగా మారింది. మోనాంక్ ఈ మ్యాచ్‍లో లేకపోవటంతో అమెరికా జట్టుకు ఆరోన్ జోన్స్ కెప్టెన్సీ చేస్తున్నాడు. నాష్‍టుష్‍ను తప్పించి షాడ్లీని జట్టులో ఎంపిక చేసుకుంది అమెరికా.

టీ20 ప్రపంచకప్‍లో తన తొలి మ్యాచ్‍లో ఐర్లాండ్‍పై భారత్ అలవోకగా గెలిచింది. రెండో పోరులో పాకిస్థాన్‍పై బ్యాటింగ్‍లో విఫలమైనా బౌలింగ్‍లో దుమ్మురేపింది రోహిత్ సేన. దీంతో విజయం సాధించింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ రెండు మ్యాచ్‍లో లోస్కోరింగ్‍గానే సాగాయి. నేటి భారత్, అమెరికా మ్యాచ్ కూడా ఇదే వేదికలో జరుగుతోంది.

భారత తుదిజట్టు: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‍ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్

అమెరికా తుదిజట్టు: షయాన్ జహంగీర్, స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గోస్ (వికెట్ కీపర్), ఆరోన్ జోన్స్(కెప్టెన్), నితీష్ కుమార్, కోరీ ఆండర్సన్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్‌ విక్, జస్‍దీప్ సింగ్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్

అమెరికా తొలి మ్యాచ్‍లో కెనడాపై గెలువగా.. పాకిస్థాన్‍పై సంచలన విజయం సాధించింది. దీంతో సూపర్-8కు చేరే అవకాశాలను బాగా మెరుగుపరుచుకుంది. నేడు భారత్‍తో మ్యాచ్ ఓడినా ఆ జట్టుకు మరో అవకాశం ఉంటుంది. గ్రూప్ దశలో ఆ టీమ్‍కు మరో మ్యాచ్ మిగిలి ఉంటుంది.

WhatsApp channel