Lakshmi narayana yogam: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాల స్థానాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అన్ని రాశి చక్ర గుర్తులను ప్రభావితం చేస్తాయి. జూన్ నెలలో రెండు ప్రధాన గ్రహాలు సంయోగం చెందడం వల్ల అత్యంత అదృష్టమైన యోగం ఏర్పడబోతుంది. జూన్ 14 నుంచి బుధుడు తన సొంత రాశి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఇప్పటికే జూన్ 12 నుంచి శుక్రుడు సంచరిస్తున్నాడు.
బుధుడు తెలివితేటలు ప్రసాదిస్తాడు. ఐశ్వర్యం, ఆకర్షణ, లాభం, సౌందర్యం, రాజసం వంటి వాటిని శుక్రుడు ఇస్తాడు. ఈ రెండు గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. బుధ, శుక్ర గ్రహాల సంయోగంతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడబోతుంది. జ్యోతిష్య శాస్త్రంలో దీన్ని అత్యంత ప్రముఖమైన యోగంగా చెబుతారు. ఈ యోగం వ్యక్తి జాతకంలో ఉంటే సంపద, కీర్తి, సౌభాగ్యం, ఆరోగ్యం లభిస్తాయి.
మిథున రాశిలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. డబ్బు కొరత ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. సుమారు 15 రోజుల పాటు ఈ యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి సంపద పెరుగుతుంది. వీరి ఆనందానికి అవధులు ఉండవు. లక్ష్మీ నారాయణ యోగం ఏ రాశి వారికి ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందో తెలుసుకుందాం.
బుధ, శుక్ర గ్రహాల కలయిక వల్ల ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం మిథున రాశిలోనే జరుగుతుంది .దీనివల్ల లాభం పొందే రాశులలో మిథునం ఒకటి. ఈ యోగం వీరిని ధనవంతులను చేస్తుంది. వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు ఇది అనువైన సమయం. దీర్ఘకాలిక రుణాల నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది. కుటుంబ సభ్యులు, తమ ప్రియమైన వారితో కలిసి ట్రిప్ కు వెళతారు. డబ్బు పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన సమయం. ఆస్తి కలిసి వస్తుంది. వ్యాపారంలో రాబడి బాగుంటుంది. ఈ కాలంలో ఏ పని తలపెట్టిన అందులో విజయం సాధిస్తారు.
లక్ష్మీనారాయణ యోగం సింహ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారాలు నిర్వహించే వ్యక్తులు ప్రయోజనాలు పొందుతారు . ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. మతపరమైన కార్యకలాపాలు, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. ఆర్థిక పురోగతి పొందుతారు. శుక్రుడి శుభ ప్రభావంతో శుభకార్యాలు జరగడంతో కుటుంబంలో సంతోషకరమైన వాతావారణం నెలకొంటుంది. ఈ కాలంలో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.
కన్యా రాశి వారికి బుధ, శుక్ర గ్రహాల సంయోగం శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ కాలం ఎక్కువగా ప్రయోజనాలను అందుతాయి. సొంతంగా వ్యాపారాలు నిర్వహించే వారికి గ్రహాల అదృష్ట ప్రభావం కారణంగా పెద్ద మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంది. జీవితంలోని సమస్యలు క్రమంగా తగ్గుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆనందంగా ఉండేందుకు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి. ఆదాయంలో పెరుగుదల, షేర్ మార్కెట్ లో లాభాలు లభిస్తాయి. కెరీర్ లో పెద్ద పెద్ద ఆఫర్లు వస్తాయి.