IRCTC Shirdi Tour : షిర్డీ, శనిశిగ్నాపూర్ ట్రిప్..! విజయవాడ నుంచి తాజా టూర్ ప్యాకేజీ, పూర్తి వివరాలివే-irctc tourism latest shirdi and nashik tour package from ap vijayawada 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Shirdi Tour : షిర్డీ, శనిశిగ్నాపూర్ ట్రిప్..! విజయవాడ నుంచి తాజా టూర్ ప్యాకేజీ, పూర్తి వివరాలివే

IRCTC Shirdi Tour : షిర్డీ, శనిశిగ్నాపూర్ ట్రిప్..! విజయవాడ నుంచి తాజా టూర్ ప్యాకేజీ, పూర్తి వివరాలివే

Vijayawada Shirdi Tour: విజయవాడ నుంచి షిర్డీకి IRCTC టూరిజం.. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. షిర్డీతో(Shirdi Tour) పాటు శనిశిగ్నాపూర్ కు కూడా చూసి రావొచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి….

విజయవాడ నుంచి షిర్డీ టూర్ ప్యాకేజీ

IRCTC Shirdi Vijayawada 2024 Tour : ఏదైనా అధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకోవాలని అనుకుంటున్నారా….? తక్కువ ధరలోనే మీ సొంత ప్రాంతాల నుంచి వెళ్లి… కొత్త ప్రదేశాలను చూసి రావొచ్చు. ఇందులో టికెట్లతో పాటు పలు సౌకర్యాలను కల్పిస్తారు.

ఈ తరహా ప్యాకేజీలను ఐఆర్‌సీటీసీ టూరిజం(IRCTC Tourism) తక్కువ ధరలోనే ప్రకటిస్తోంది.  తాజాగా విజయవాడ నుంచి షిర్డీ(Shirdi Tour) వెళ్లేందుకు టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీని జూన్ 18వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే… మరో తేదీలో కూడా బుకింగ్ చేసుకుని వెళ్లొచ్చు. https://www.irctctourism.com/p వెబ్ సైట్ లోకి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

విజయవాడు టూ షిర్డీ, ప్యాకేజీ వివరాలు:

  • “SAI SANNIDHI EX VIJAYAWADA” పేరుతో విజయవాడ నుంచి షిర్డీకి IRCTC టూరిజం ప్యాకేజీని ప్రకటించింది .
  • ఇది 4 రోజుల టూర్ ప్యాకేజీ. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ జూన్ 18, 2024 తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీలో మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు.
  • ట్రైన్ జర్నీ  ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
  • విజయవాడలోనే కాకుండా.. ఖమ్మం, సికింద్రాబాద్, విజయవాడ, వరంగల్ రైల్వే స్టేషన్లల్లో కూడా రైలు ఎక్కే అవకాశం ఉంటుంది.
  • మొదటి రోజు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రి 10.15 గంటలకు షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలు(17208- Sainagar Shirdi Express) ఎక్కాలి. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
  • 2వ రోజు ఉదయం 06.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి వెళ్తారు. ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రి షిర్డీలోనే బస చేస్తారు.
  • మూడో రోజు మార్నింగ్ శనిశిగ్నాపూర్ కు వెళ్తారు. అక్కడ్నుంచి మళ్లీ షిర్టీ చేరుకుంటారు. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తెల్లవారుజామున మూడు గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
  • ఈ ప్యాకేజీ ధరలు చూస్తే…. కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 16,165గా నిర్ణయించారు.  డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10045, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8440 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. 
  • స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు 5,985గా ధర ఉంది. సింగిల్ షేరింగ్ కు రూ. 13705గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 7590గా ఉంది. 
  • ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే  040-27702407, 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మరిన్ని ప్యాకేజీలను కూడా ఈ సైట్ లో చూడొచ్చు.
  • విజయవాడనే కాకుండా… విశాఖ, తిరుపతి, రాజమండ్రితో పాటు పలు నగరాల నుంచి పలు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.