తెలుగు న్యూస్ / ఫోటో /
KKR vs SRH Qualifier 1: సన్ రైజర్స్, కేకేఆర్ మ్యాచ్‌కు వాతావరణం ఎలా ఉంది? వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఫైనల్ చేరేదెవరు?
- KKR vs SRH Qualifier 1: సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య తొలి క్వాలిఫయర్ అహ్మదాబాద్ లో మంగళవారం (మే 21) జరగబోతోంది. మరి ఈ మ్యాచ్ వాతావరణం ఎలా ఉంది? ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఫైనల్ చేరేదెవరు?
- KKR vs SRH Qualifier 1: సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య తొలి క్వాలిఫయర్ అహ్మదాబాద్ లో మంగళవారం (మే 21) జరగబోతోంది. మరి ఈ మ్యాచ్ వాతావరణం ఎలా ఉంది? ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఫైనల్ చేరేదెవరు?
(1 / 5)
KKR vs SRH Qualifier 1: ఐపీఎల్ 2024లో భాగంగా తొలి క్వాలిఫయర్ అహ్మదాబాద్ లో సన్ రైజర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. గత వారం కేకేఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు వర్షం వల్ల మ్యాచ్ రద్దయింది. మరి మంగళవారం (మే 21) కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
(2 / 5)
KKR vs SRH Qualifier 1: ఐపీఎల్ 2024లో కొన్ని మ్యాచ్ లు ఇప్పటికే వర్షం వల్ల రద్దయ్యాయి. మరి క్వాలిఫయర్ మ్యాచ్ రద్దయితే? నిబంధనల ప్రకారం కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ జరిగితేనే విజేతను తేలుస్తారు. ఒకవేళ అది కూడా సాధ్యం కాకుండా మ్యాచ్ రద్దయితే లీగ్ స్టేజ్ లో టాప్ లో నిలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. అంటే కేకేఆర్ ఫైనల్ వెళ్తుంది. ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే లేదు.
(3 / 5)
KKR vs SRH Qualifier 1: మ్యాచ్ రద్దయితే కేకేఆర్ ఫైనల్ చేరుతుంది. సన్ రైజర్స్ కు క్వాలిఫయర్ 2 రూపంలో మరో అవకాశం లభిస్తుంది. ఈ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. గ్రూప్ స్టేజ్ లో 20 పాయింట్లతో కేకేఆర్ టాప్ లో ఉండగా.. సన్ రైజర్స్ 17 పాయింట్లతో రెండో స్థానంలో అర్హత సాధించింది.
(4 / 5)
KKR vs SRH Qualifier 1: లీగ్ స్టేజ్ లో కేకేఆర్ ఆడాల్సిన చివరి రెండు మ్యాచ్ లు వర్షం వల్ల రద్దయ్యాయి. ఇది కూడా రద్దయితే మూడు మ్యాచ్ లుగా ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా ఫైనల్ చేరుతుంది. అది ఒక రకంగా ఆ జట్టుకు ప్రతికూలమనే చెప్పాలి. మే 11న కేకేఆర్ తన చివరి మ్యాచ్ ఆడింది.
(5 / 5)
KKR vs SRH Qualifier 1: మరి ఈ తొలి క్వాలిఫయర్ జరిగే అహ్మదాబాద్ లో వర్షం పడే అవకాశం ఉందా? వాతావరణ శాఖ ప్రకారం.. మంగళవారం (మే 21) అహ్మదాబాద్ లో అసలు వర్షం పడే అవకాశమే లేదు. వడగాలులు మాత్రం వీస్తాయని హెచ్చరించింది. దీంతో కేకేఆర్, సన్ రైజర్స్ మ్యాచ్ సజావుగా సాగనుంది. అదే జరిగితే అభిమానులకు పరుగుల పండగే అని చెప్పొచ్చు.
ఇతర గ్యాలరీలు