ఎయిర్ పొల్యూషన్ నుంచి ఊపిరితిత్తులను శుభ్రపరిచే 6 డిటాక్స్ డ్రింక్స్
pexels
By Bandaru Satyaprasad Dec 22, 2024
Hindustan Times Telugu
వాయు కాలుష్యం వల్ల హానికరమైన కణాలను శ్వాసవ్యవస్థలోకి చేరి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మీ ఊపిరితిత్తులను శుభ్రపరచడానికి 6 ప్రభావవంతమైన డిటాక్స్ డ్రింక్స్ తెలుసుకుందాం.
pexels
బీట్ రూట్ జ్యూస్ - యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన బీట్ రూట్ జ్యూస్ ఆక్సిజన్ ప్రవాహాన్ని, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
pexels
గ్రీన్ టీ - యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు రెండింటినీ కలిగి ఉన్న గ్రీన్ టీ తాగడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, హానికరమైన టాక్సిన్స్ తొలగించడానికి సహాయపడతాయి. బరువు తగ్గడానికి కూడా మద్దతు ఇస్తుంది.
pexels
ఆపిల్ సైడర్ వెనిగర్ - ఇది మీ శరీర pH స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. టాక్సిన్స్ తొలగింపులో సహాయపడుతుంది. నీటితో కలిసి తాగితే ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది.
pexels
అల్లం, తేనె టీ - అల్లం, తేనె రెండూ యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శ్లేష్మం క్లియర్ చేయడంలో సహాయపడతాయి. శ్వాసకోశ ఆరోగ్యానికి తోడ్పడతాయి. గొంతు నొప్పి నుంచి ఉపశమనం కల్పిస్తుంది.
pexels
పసుపు, అల్లం టీ - యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలకు కలిగి ఉంటే పసుపులోని కర్కుమిన్..ఊపిరితిత్తులలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. వాయు కాలుష్యం వల్ల కలిగే ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి, గొంతు నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.
pexels
వెచ్చని నిమ్మకాయ నీరు- టాక్సిన్స్ ఫ్లష్ చేయడానికి సులభమైన మార్గం నిమ్మకాయ నీరు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఎసిడిక్ కాంపౌండ్స్ ను తటస్థీకరించి, డీటాక్సిఫికేషన్ కు మద్దతు ఇస్తుంది.
pexels
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు కచ్చితంగా తినాలి..