తెలుగు న్యూస్ / ఫోటో /
Salaar 2: సలార్ విషయంలో ఆ అసంతృప్తి ఉంది.. పార్ట్ 2 నా బెస్ట్ సినిమా అవుతుంది: ప్రశాంత్ నీల్
- Salaar 2: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకు ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాట్లాడారు. సలార్ 2 గురించి హైప్ పెంచేశారు.
- Salaar 2: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకు ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాట్లాడారు. సలార్ 2 గురించి హైప్ పెంచేశారు.
(1 / 6)
‘సలార్ పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ మూవీ రిలీజై నేటి (డిసెంబర్ 22)తో సంవత్సరం పూర్తయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ హైవోల్టేజ్ యాక్షన్ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు ప్రశాంత్ నీల్. హోంబాలే ఫిల్మ్స్ ఈ ఇంటర్వ్యూను వెల్లడించింది.
(2 / 6)
సలార్ పార్ట్ 1 కమర్షియల్‍గా హిట్ అయింది. కానీ ఈ మూవీ థియేట్రికల్ పర్ఫార్మెన్స్ విషయంలో తాను పూర్తి సంతోషంగా లేనని ఈ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ చెప్పారు. సలార్ కోసం తాను చాలా కష్టపడ్డానని, అందుకు తగ్గట్టుగా థియేట్రికల్ పర్ఫార్మెన్స్ లేకపోవడం కాస్త అసంతృప్తి కలిగించిందని చెప్పారు. (Photo: HombaleFilms)
(3 / 6)
సలార్ 2 చిత్రం తన కెరీర్లోనే ఒకానొక బెస్ట్ సినిమాగా నిలిచిపోతుందని ప్రశాంత్ నీల్ అన్నారు. తాను ఈ చిత్రాన్ని అద్భుతంగా రాస్తున్నానని అన్నారు. ఇది తన ఒకానొక బెస్ట్ వర్క్‌గా ఉంటుందని చెప్పారు.
(4 / 6)
“సలార్ 2 విషయంలో చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నా. నేను జీవితంలో కొన్ని విషయాలపై ఎక్కువ కాన్ఫిడెంట్‍గా ఉంటా. సలార్ 2 కచ్చితంగా నా బెస్ట్ వర్క్ అవుతుంది” అని ప్రశాంత్ నీల్ వెల్లడించారు.
(5 / 6)
2023 డిసెంబర్ 22న రిలీజైన సలార్ చిత్రం సుమారు రూ.700కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకొని హిట్ అయింది. అయితే, ప్రభాస్ స్టార్ డమ్, పూర్తి పాజిటివ్ టాక్ రావడంతో రూ.1,000కోట్లు కొడుతుందని అంచనాలు వచ్చినా.. ఆ మార్క్ సాధ్యం కాలేదు. దీంతోనే ప్రశాంత్ నీల్ కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు అర్థమవుతోంది.(Instagram)
ఇతర గ్యాలరీలు