తెలుగు న్యూస్ / ఫోటో /
Pregnancy Diet: ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాారా..? అయితే మీ డైట్‌లో ఇవి తప్పకుండా ఉండేలా చూసుకోండి
Pregnancy Diet: తల్లి కావాలని కోరుకునే వారు తమ ఆహారం విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రెగ్నీన్సీ కోసం ట్రై చేసే మహిళలు తప్పకుండా తినాల్సిన ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. మీరూ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నట్లయితే మీ డైట్‌లో ఇవి ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి.
(1 / 6)
ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న సమయంలో ఆహారం మీద సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. సంతానోత్పత్తి సామర్థ్యం పెరగడానికి, గర్భధారణ సాఫీగా జరగడానికి, శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు, తల్లికి సరైన పోషకాలు అందేలా చూసుకోవాలి. ఈ సమయంలో కొన్ని జీవనశైలిలో మార్పులుతో పోషకాహారం విషయంలో బాగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నవారు తప్పకుండా తీసుకోవాల్సిన కొన్ని ఆహారాల జాబితా ఇక్కడ ఉంది. (Pixabay)
(2 / 6)
వాల్నట్స్: ఇవి మహిళల అండోత్సర్గము, స్పెర్మ్ ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. గర్బం దాల్చడాన్ని సహజంగా ప్రోత్సహించడానికి ఇవి సహాయపడతాయి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలో హార్మోన్ లెవల్స్ (హార్మోన్ల సామర్థ్యం) ను మెరుగుపరుస్తాయి. వాల్నట్స్ లో ఉండే ప్లాంట్-బేస్డ్ ప్రోటీన్ అండాల ఉత్పత్తిని పెంపొందిస్తుంది.
(3 / 6)
టమోటాలు: టమాటా అనేది పోషకాలతో నిండిన, ఆరోగ్యకరమైన ఆహారం, ఇది గర్భధారణ కోసం ట్రై చేస్తున్న మహిళలకు కొన్ని ముఖ్యమైన లాభాలను అందిస్తుంది. ఇందులోని విటమిన్ సీ శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ బలోపేతం చేసి గర్బం దాల్చడం కోసం హార్మోన్ బ్యాలెన్స్ ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. టమాటాలో ఉన్న ఫోలేట్ శిశువు న్యూరల్ ట్యూబ్ అభివృద్ధికి, హార్మోన్ ప్రొడక్షన్ కు మద్దతు ఇస్తుంది. ఇందులోని లైకోపీన్ స్పెర్మ్ కౌంట్ ను పెంచి ప్రెగ్నెన్సీ అవకాశాలను పెంపొందిస్తుంది.
(4 / 6)
సిట్రస్ ఫ్రూట్స్ (నారింజ, లెమన్, మోసంబి, గ్రేప్ ఫ్రూట్) గర్భధారణ కోసం ట్రై చేస్తున్న మహిళలకు చాలా అనుకూలమైన ఆహారాలు.ఇందులోని విటమిన్ సీ శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ బలోపేతం చేస్తుంది. ఫోలేట్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు హార్మోన్ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. శిశువు న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడంలో సహాయపడుతుంది.నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లు మగ, ఆడ పునరుత్పత్తి అవయవాల పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
(5 / 6)
ఫుల్ ఫ్యాట్ మిల్క్ లేదా పనీర్: ఫుల్ ఫ్యాట్ మిల్క్ లేదా పనీర్ సంతానలేమిని తగ్గించడమే కాకుండా గుడ్ల అభివృద్ధికి సహాయపడుతుంది. ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తుంది, ఇవి శరీరంలో శక్తి, పోషకాలను జోడించడంలో సహాయపడతాయి. హార్మోన్ లెవల్స్ సమతుల్యంగా ఉంచడానికి, గర్భధారణ సమయంలో అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది.
(6 / 6)
బీన్స్, గింజలు: మొక్కల ఆధారిత ప్రోటీన్లను అందిస్తాయి, ఇవి వంధ్యత్వ రేటును తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి శరీరానికి అవసరమైన ప్రోటీన్లను అందించి, హార్మోన్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి, తద్వారా వంధ్యత్వం అంటే సంతానలేమిని నివారించడంలో సహాయపడుతుంది. వీటిలో ఉండే ఫోలేట్, జింక్, ఆంటీ-ఆక్సిడెంట్లు, మరియు ఫైబర్ శరీరంలో హార్మోన్ బ్యాలెన్స్ ను మెరుగుపరచి, ఫర్టిలిటీ పెరిగేందుకు సహాయపడతాయి.
ఇతర గ్యాలరీలు