AP Registration : ఒక్క క్లిక్‌తో.. ఇంటివద్దే ఈసీలు పొందే అవకాశం.. 9 ముఖ్యమైన అంశాలు-9 tips to get ap registration department ecs through online ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Registration : ఒక్క క్లిక్‌తో.. ఇంటివద్దే ఈసీలు పొందే అవకాశం.. 9 ముఖ్యమైన అంశాలు

AP Registration : ఒక్క క్లిక్‌తో.. ఇంటివద్దే ఈసీలు పొందే అవకాశం.. 9 ముఖ్యమైన అంశాలు

Basani Shiva Kumar HT Telugu
Dec 22, 2024 11:56 AM IST

AP Registration : భూములు, స్థలాలకు సంబంధించిన దస్తావేజు నకళ్లు, ఈసీల కోసం.. ఇన్నాళ్లు రిజిస్ట్రేషన్‌ కార్యాలయం, మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పరిస్థితి మారింది. ఒక్క క్లిక్‌తో ఇంటిదగ్గరే ఈసీలు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

ఇంటివద్దే ఈసీలు పొందే అవకాశం
ఇంటివద్దే ఈసీలు పొందే అవకాశం

గతంలో రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌పోర్టల్‌ ద్వారా చాలా సేవలు అందుబాటులో ఉండేవి. కానీ.. గత ప్రభుత్వం ఆ విధానాన్ని తొలగించింది. దీంతో భూములు, స్థలాలకు సంబంధించిన దస్తావేజు నకళ్లు, ఈసీల కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చేది. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల అవస్థలను గుర్తించిన కూటమి ప్రభుత్వం.. సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది.

రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సేవలను కూటమి ప్రభుత్వం సులభతరం చేసింది. నకళ్లు, ఈసీలు పొందడానికి సాప్ట్‌వేర్‌ను రూపొందించింది. ీ సాఫ్ట్‌వేర్ ద్వారా ఇంటి వద్ద నుంచే వీటిని తీసుకోవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించి.. ఒకే ఒక్క క్లిక్‌తో కావాల్సిన పత్రాలు పొందవచ్చు. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎలా పొందాలి..

1.ఈ వెబ్‌ పోర్టల్‌ ద్వారా ప్రస్తుతం అయిదు రకాల సేవలు పొందడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.

2. https:///egistration.ap.gov.in పోర్టల్‌లో కుడివైపు ఉన్న ఈసీ, సీసీ సెర్చ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. సేవలు ఉన్న పేజీలో ఈసీ సమాచారం కనపడుతుంది.

3.ఈసీ సైన్డ్, సీసీ సైన్డ్‌ ఆప్షన్లు ఉంటాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ సంతకంతో ఈసీ కావాలంటే మొదటి ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

4.పేరు, చిరునామా, దస్తావేజు నంబరు, రిజిస్ట్రేషన్‌ జరిగిన సంవత్సరం నమోదు చేస్తే.. ఎలాంటి ఫీజు లేకుండా సమాచారం వస్తుంది.

5.రిజిస్ట్రార్‌ సంతకం లేకుండా కావాలంటే.. రెండు, మూడు ఆప్షన్లపై క్లిక్‌ చేస్తే యూజర్‌ లాగిన్‌ ఆప్షన్‌ కనపడుతోంది.

6.మెయిల్‌ ఐడీ, ఫోన్, ఆధార్‌ నంబర్లు ఎంటర్ చేయాలి. మొబైల్‌కి ఓటీపీ వస్తోంది. దీన్ని అందులో నమోదు చేస్తే.. ఈసీ, సీసీ ఆప్షన్లు కనిపిస్తాయి.

7.ఏదీ అవసరమో దానిపై మళ్లీ క్లిక్‌ చేసి దస్తావేజు నంబరు, రిజిస్ట్రేషన్‌ సంవత్సరం, రిజిస్ట్రార్‌ ఆఫీసు చిరునామా వివరాలు నమోదు చేయాలి. యాక్సెప్ట్ చేశాక ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లిస్తే యూజర్‌ లాగిన్‌లో దస్తావేజుల ఫైల్‌ కనిపిస్తోంది.

8.ఆ ఫైల్‌ను దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దస్తావేజు నకళ్లు 2015, ఈసీలైతే 1983 నుంచి అందుబాటులో ఉన్నాయి.

9.దస్తావేజు ప్రతులకు రూ.320, 30 సంవత్సరాలు పైబడిన ఈసీ కోసం రూ.600, అంతకన్నా తక్కువైతే రూ.300 ఫీజు రూపంలో చెల్లించాలి.

ఈ సేవలపై ఎలాంటి సందేహాలు, సమస్యలు ఉన్నా.. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదించవచ్చు.

Whats_app_banner