CM Jagan Review : సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్‌ సహా అన్ని సేవలు- సీఎం జగన్ కీలక ఆదేశాలు-amaravati cm jagan review meet orders on jagananna housing scheme registration at village secretariat ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan Review : సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్‌ సహా అన్ని సేవలు- సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM Jagan Review : సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్‌ సహా అన్ని సేవలు- సీఎం జగన్ కీలక ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Jun 14, 2023 03:28 PM IST

CM Jagan Review : రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటి వరకూ సుమారు 3.9 లక్షల వరకూ ఇళ్లు పూర్తయ్యాయన్నారు. సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి అన్ని ఏర్పాట్లూ చేయాలన్న సీఎం జగన్... జులై 8 నుంచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

సీఎం జగన్
సీఎం జగన్

CM Jagan Review : జగనన్నకు చెబుదాం, గడపగడపకూ మన ప్రభుత్వం, ఉపాధి హామీ పనులపై సీఎం జగన్ సమీక్షించారు. స్పందనలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జగనన్నకు చెబుదాం వినతుల పరిష్కారంలో క్వాలిటీ చాలా ముఖ్యమని సీఎం జగన్ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతున్నామన్నారు. ఒకవేళ గ్రీవెన్స్‌ను రిజెక్ట్ చేస్తే సంబంధిత ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లి ఎందుకు రిజెక్షన్‌కు గురైందో వారికి వివరించాలన్నారు. పరిశీలించని గ్రీవెన్సెస్‌ ఏమైనా ఉంటే 24 గంటల్లో వాటిని పరిష్కరించాలన్నారు. ఈనెల 23 నుంచి జులై 23 వరకూ జగనన్న సురక్షా కార్యక్రమం నిర్వహించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్షా కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఏదైనా పత్రాలకు సంబంధించి, సర్టిఫికెట్లకు సంబంధించి, అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవా? అన్నదానిపై ఆరా తీయాలని సూచించారు. డాక్యుమెంటేషన్‌, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పథకాలు, అర్హతలు వాటికి సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహించాలన్నారు. సమస్యలు ఉన్నవారిని సచివాలయాల వద్దకు తీసుకువచ్చి వారి కావాల్సిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అన్నీ కూడా అందించాలని సూచించారు. జగనన్న సురక్షలో వివిధ పథకాల కింద అర్హులుగా గుర్తించినవారికి ఆగస్టు 1న నగదు బదిలీ చేస్తామన్నారు.

సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలపై

"ఈ ఏడాదిలో ఉపాధి హామీ కింద 24 కోట్ల పనిదినాలు కల్పించాలి. ఇందులో 60శాతం పనిదినాలు.. ఈనెలాఖరులోగా పూర్తికావాలి. ప్రతిరోజూ ప్రతి జిల్లాలో కనీసం 75 వేల పనిదినాలు కల్పించాలి. సచివాలయాలు, ఆర్బీకేలు, విజేజ్‌క్లినిక్స్‌, డిజిటల్‌ గ్రంథాలయాలను వెంటనే పూర్తిచేయాలి. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నాం. ఇప్పటి వరకూ సుమారు 3.9 లక్షల వరకూ ఇళ్లు పూర్తయ్యాయి. రూఫ్‌ లెవల్‌, ఆపై ఉన్నవి సుమారు 5.27 లక్షలు ఉన్నాయి. వీటిని త్వరతిగతిన పూర్తిచేసేలా చూడాలి. మిగతా ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వాటి వేగాన్ని పెంచేలా చూడాలి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత సుమారు రూ.1475 కోట్లు ఇచ్చాం. సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్లనిర్మాణానికి అన్ని ఏర్పాట్లూ చేయాలి. జులై 8 నుంచి పనులు ప్రారంభించాలి. ఆప్షన్‌ -3 ఎంపిక చేసుకున్న వారికి వెంటనే ఇళ్లు నిర్మాణాలు మొదలుకావాలి."- సీఎం జగన్

కల్తీలు కనిపించకూడదు

ఖరీఫ్‌ పనులు ప్రారంభం అయ్యాయన్న సీఎం జగన్...విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా కల్తీలు కనిపిస్తే కలెర్టర్లను, ఎస్పీలను బాధ్యుల్ని చేస్తానన్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా ఉండండని ఆదేశించారు. జులై 1 నుంచి ఇ-క్రాప్‌ బుకింగ్స్‌ ప్రారంభించి సెప్టెంబర్ మొదటి వారానికి పూర్తిచేయాలన్నారు. సెప్టెంబరు నెలాఖరులోగా తుది జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు. సీసీఆర్సీ కార్డులపై అవగాహన కల్పించి, కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అన్నారు. మొదటి ఫేజ్‌లో 2 వేల గ్రామాల్లో జగనన్న భూ హక్కు, భూ రక్ష కార్యక్రమం పూర్తయ్యిందన్నారు. సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్‌ సహా అన్నిరకాల సేవలు వీరికి అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ గ్రామాల నుంచి రైతులు ఎవ్వరు కూడా తహశీల్దార్‌, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదన్నారు. ప్రతి పని కూడా గ్రామ సచివాలయాల స్థాయిలోనే జరగాలన్నారు. రెండో దశ కింద మరో 2 వేల గ్రామాల్లో సెప్టెంబర్‌ 30కల్లా భూపత్రాలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. అక్టోబరు 15 నుంచి రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాలు ప్రారంభం కావాలన్నారు.

విద్యాకానుక కిట్ల పంపిణీపై

జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీపై కలెక్టర్లు సమీక్ష చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎక్కడైనా సరిపడా లేకున్నా, ఇచ్చిన వస్తువుల బాగోలేకున్నా వెంటనే సమాచారం తెప్పించుకుని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నాడు- నేడు కింద పనులు పూర్తిచేసుకున్న పాఠశాలల్లోని తరగతి గదుల్లో ఆరో తరగతి, ఆపై క్లాసులకు సంబంధించి తరగతి గదుల్లో జులై 12 కల్లా ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ ఏర్పాటు కావాలన్నారు. వాటిని చక్కగా వినియోగించుకోవడంపై ఉపాధ్యాయులకు మంచి శిక్షణ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు.

Whats_app_banner