TG MeeSeva : మీసేవ కేంద్రాల్లో ఏ సర్టిఫికెట్‌కు ఎంత ఫీజు.. ఎక్కువ వసూలు చేస్తే ఏం చేయాలి?-how much is the fee for any certificate at meeseva centers in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Meeseva : మీసేవ కేంద్రాల్లో ఏ సర్టిఫికెట్‌కు ఎంత ఫీజు.. ఎక్కువ వసూలు చేస్తే ఏం చేయాలి?

TG MeeSeva : మీసేవ కేంద్రాల్లో ఏ సర్టిఫికెట్‌కు ఎంత ఫీజు.. ఎక్కువ వసూలు చేస్తే ఏం చేయాలి?

Basani Shiva Kumar HT Telugu
Nov 26, 2024 03:43 PM IST

TG MeeSeva : పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా.. మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిందే. అయితే.. మన అవసరాన్ని బట్టి కొందరు మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటారు. ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే.. ఏం చేయాలో తెలియక చాలామంది వదిలేస్తుంటారు.

మీసేవ
మీసేవ

తెలంగాణలోని మీసేవ కేంద్రాల్లో రకరకాల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఏయే సర్టిఫికెట్‌కు ఎంత వసూలు చేయాలో ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ.. కొందరు మాత్రం అమాయకుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. మీసేవ కేంద్రాల్లో ఫేర్ ఛార్ట్ కూడా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో సర్టిఫికెట్లు అవసరం ఉన్నవారు డబ్బులు ఎక్కువ చెల్లించి మోసపోతున్నారు.

దేనికి ఎంత..

1.డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్‌ కు రూ.95 (అదనంగా 5 రూపాయలు దరఖాస్తు ఫామ్ కోసం తీసుకుంటారు)

2.కుల ధ్రువీకరణ పత్రం కోసం రూ.45

3.ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం రూ.45

4.ఓబీసీ సర్టిఫికెట్ కోసం రూ.45

5.డెత్ సర్టిఫికెట్ కోసం రూ.45

6.నివాస ధ్రువీకరణ పత్రం కోసంరూ.45

ఇంకా చాలారకాల ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. కానీ.. ఎక్కువగా ఈ 6 సర్టిఫికెట్ల కోసం ప్రజలు వస్తుంటారు. వారి దగ్గర మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రశ్నిస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం చెబుతారు. దీంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలామంది సైలెంట్‌ గా వెళ్లిపోతారు. టీజీ ఆన్‌లైన్, టీజీటీఎస్ కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

ప్రజల దగ్గర్నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే.. జిల్లా స్థాయిలో వీటిపై డీఎం ఉంటారు. ప్రతీ జిల్లాకు ఒక డీఎం ఉండి వీటిపై పర్యవేక్షణ చేస్తారు. ఆ పైస్థాయిలో ఈడీఎం ఉంటారు. డీఎం స్థాయిలో ఫిర్యాదుపై స్పందించకపోతే.. ఈడీఎంకు ఫిర్యాదు చేయవచ్చు. ఇటీవలే ప్రభుత్వం మీసేవా సేవల్ని విస్తరించాలని నిర్ణయించింది. మరో 9 సేవలను మీసేవ పరిధిలోకి తీసుకొచ్చింది.

పౌరుల పేరు మార్పు సర్టిఫికెట్

క్రిమిలేయర్‌ సర్టిఫికెట్

గ్యాప్‌ సర్టిఫికెట్‌

నాన్‌ క్రిమిలేయర్‌ సర్టిఫికెట్

పాత రికార్డుల కాపీలు (ఖాస్రా/సెస్సాలా పహాణీ)

మైనార్టీ సర్టిఫికెట్‌

మరోసారి సర్టిఫికెట్ల జారీ (రీ ఇష్యూ)

1బీ సర్టిఫైడ్‌ కాపీ

మార్కెట్‌ విలువపై సర్టిఫైడ్‌ కాపీ

Whats_app_banner