తెలుగు న్యూస్ / ఫోటో /
IIT Hyderabad Recruitment 2024 : ఐఐటీ హైదరాబాద్‌లో 31 నాన్ టీచింగ్ ఖాళీలు - దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ
- IIT Hyderabad Recruitment 2024 : ఐఐటీ హైదరాబాద్ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన గడువు ఇవాళ్టితో (డిసెంబర్ 10) పూర్తి కానుంది. మొత్తం 31 ఖాళీలు ఉన్నాయి. https://iith.ac.in/careers/ లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవచ్చు…

(1 / 6)
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే.. ఇందులో భాగంగా పలు విభాగాల్లో నాన్ - టీచింగ్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు.
(2 / 6)
ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ఇవాళ్టితో (డిసెంబర్ 10,2024) పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు సాయంత్రం 05.00 గంటలలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
(3 / 6)
మొత్తం 31 ఖాళీలు ఉన్నాయి. పీఆర్వో ఒక పోస్టు ఉండగా... ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు మూడు ఉన్నాయి. సూపరింటెండింగ్ ఇంజినీర్ - 1, టెక్నికల్ సూపరింటెండెంట్ - 1, స్టాఫ్ నర్స్ 05 పోస్టులు ఉన్నాయి. ఇక జూనియర్ సైకలాజికల్ కౌన్సెలర్ పోస్టు ఒకటి ఉండగా... ఫిజియోథెరపిస్ట్ మరో పోస్టు ఉంది. జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) విభాగంలో రెండు ఖాళీలు ఉండగా... అకౌంటెంట్ పోస్టులు 2 ఉన్నాయి.
(4 / 6)
రాత పరీక్ష ఉంటుంది. అంతేకాకుండా.. స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితాను విడుదల చేస్తారు. ఈ పోస్టులన్నీ కూడా రెగ్యూలర్ బేస్ విధానంలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
(5 / 6)
పోస్టును అనుసరించి అర్హతలను నిర్ణయించారు. దరఖాస్తులను కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. https://iith.ac.in/careers/ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇతర గ్యాలరీలు