
హంద్రీ-నీవా కాల్వల విస్తరణ పనుల ద్వారా కృష్ణా జలాలు కుప్పం వరకు చేరాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు… కృష్ణమ్మకు జలహరతి ఇచ్చారు. ఆ తర్వాత సీఎం ప్రసంగిస్తూ… కుప్పం సహా సీమలోని ప్రతి చెరువునూ నింపుతామన్నారు. కృష్ణమ్మను కుప్పానికి తీసుకొచ్చామని.. తన సంకల్పం నిజమైందని హర్షం వ్యక్తం చేశారు.



