Ooru Peru Bhairavakona Collections: ఊరు పేరు భైరవకోన ఫస్ట్ డే కలెక్షన్స్ - మిక్స్‌డ్ టాక్‌తో అదరగొట్టిన సందీప్ కిషన్
Ooru Peru Bhairavakona Collections: సందీప్‌కిషన్ ఊరు పేరు భైరవకోన ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా ఆరు కోట్ల మూడు లక్షల వసూళ్లను సాధించింది. సందీప్‌కిషన్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
Ooru Peru Bhairavakona Collections: ఊరు పేరు భైరవకోన సందీప్‌కిషన్ కెరీర్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. తొలిరోజు వరల్డ్ వైడ్‌గా ఊరు పేరు భైరవకోన మూవీకి 6.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సినిమా యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా నైజాం ఏరియాలో కోటిన్నర వరకు సందీప్‌కిషన్ మూవీ వసూళ్లను దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
పది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్...
రిలీజ్‌కు ముందు ట్రైలర్, టీజర్‌తో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులతో పాటు బిజినెస్ వర్గాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. దాదాపు పదిన్నర కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. సందీప్‌కిషన్ కెరీర్‌లో అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల్లో ఒకటిగా ఊరు పేరు భైరవకోన సినిమా నిలిచింది. దాదాపు పదకొండు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
లాభాల్లోకి అడుగుపెట్టాలంటే...
తొలిరోజు ఆరు కోట్ల మూడు లక్షల వరకు గ్రాస్, మూడున్నర కోట్ల వరకు షేర్ కలెక్షన్స్‌ను ఈ సినిమా సొంతం చేసుకున్నది. లవర్స్ డే రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. అందులో మరో కోటి పది లక్షల వరకు వసూళ్లు వచ్చాయి. ప్రీమియర్స్‌తో పాటు ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి ఈ సినిమా ఏడు కోట్ల ఇరవై లక్షలకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది. సందీప్‌కిషన్ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టాలంటే మరో ఏడు కోట్ల వరకు కలెక్షన్స్ రావాల్సి ఉంది.
ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్...
ఊరు పేరు భైరవ కోన సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. సినిమా కథతోపాటు బీజీఎమ్, విజువల్స్ బాగున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సినిమా కథ ఇదే...
భైరవకోన అనే ఊరిలో అడుగుపెట్టిన వారు ఎవరూ ప్రాణాలతో తిరిగివచ్చిన దాఖలాలు ఉండవు. దొంగతనం చేసి తప్పించుకునే క్రమంలో బసవ (సందీప్ కిషన్) అతడి స్నేహితులు ) జాన్ (వైవా హర్ష), గీత (కావ్యథాపర్) భైరవకోనలో అడుగుపెడతారు. అక్కడ వారికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి? బైరవ కోన నుంచి వారు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? ప్రియురాలు భూమి (వర్ష బొల్లమ్మ ) కోసం బసవ ఎందుకు దొంగతనం చేయాల్సివచ్చింది? అన్నదే ఈ మూవీ కథ.
టైగర్ తర్వాత...
టైగర్ తర్వాత సందీప్‌కిషన్, డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో ఈ మూవీ తెరకెక్కింది. ఊరు పేరు భైరవకోన సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించాడు. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా ఈ మూవీని నిర్మించాడు. ప్రస్తుతం సందీప్‌కిషన్ మయావన్ 2తోపాటు తెలుగు, తమిళ భాషల్లో మరికొన్ని సినిమాలు చేశాడు. సంక్రాంతికి రిలీజైన ధనుష్ కెప్టెన్ మిల్లర్‌లో సందీప్‌కిషన్ గెస్ట్ రోల్ చేశాడు. ఫిబ్రవరి 9న రిలీజ్ కావాల్సిన ఊరు పేరు భైరవకోన రవితేజ ఈగల్ కారణంగా ఫిబ్రవరి 16కు వాయిదాపడింది.