Swapna Dutt regret for Arjun reddy: అర్జున్ రెడ్డి సినిమాపై స్వప్నా దత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ విషయంలో బాధపడుతున్నా
Swapna Dutt regret for Arjun reddy: అర్జున్ రెడ్డి సినిమా విషయంలో తాను రిగ్రెట్ ఫీలవుతున్నానని ప్రముఖ స్వప్నా దత్ తెలిపారు. సినిమా కథ నచ్చినప్పటికీ తీసే ధైర్యం తనకు రాలేదని స్పష్టం చేశారు.
Swapna Dutt regret for Arjun reddy: అర్జున్ రెడ్డి.. తెలుగులో కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న చిత్రం. ముఖ్యంగా యూత్ నుంచి ఈ సినిమాకు విపరీతంగా ఆదరణ లభించింది. ఎంతలా అంటే ఇందులో హీరోగా చేసిన విజయ్ దేవరకొండను, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను ఓవర్ నైట్ స్టార్లను చేసింది. ఈ మూవీని సందీప్ రెడ్డి సోదరుడు భద్రకాళీ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. అయితే తొలుత ఈ సినిమా కథను ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కుమార్తే అయిన స్వప్నా దత్‌కు సందీప్ చెప్పారట. అయితే ఆమెకు స్టోరీని నచ్చినప్పటికీ తీయలేకపోవడానికి గల కారణాన్ని వివరించారు.
అర్జున్ రెడ్డి కథ తొలుత తనకే సందీప్ చెప్పాడని, కానీ స్టోరీని సినిమాగా తీయడానికి తనకు ధైర్యం సరిపోలేదని స్వప్న తెలిపారు. అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఇప్పుడు తను చిందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా స్వప్న ఈ విషయం గురించి తెలియజేశారు.
"ఒకవేళ అర్జున్ రెడ్డి సినిమా ఫ్లాప్ అయితే ఓ మహిళ ఇలాంటి సినిమా ఎందుకు నిర్మించాల్సి వచ్చిందని ప్రజలు విమర్శించేవాళ్లు. అందుకే ధైర్యం చేయలేకపోయాను. ఆ నిర్ణయంపై ఇప్పుడు బాధపడుతున్నాను. పెళ్లి చూపులు విషయానికొస్తే ఆ సమయంలో కథ నాకు అంత ఆసక్తికరంగా అనిపించలేదు. స్టోరీ ఫార్మాట్‌కు నేను కనెక్ట్ కాలేదు." అని స్వప్న తెలిపారు.
ఇప్పటి వరకు చిత్రసీమలో తన జర్నీ గురించి సంతృప్తి వ్యక్తం చేశారు స్వప్న. కెరీర్ ఇలా కొనసాగినందుకు ఆనందంగా ఉందని, వైఫల్యాల నుంచి చాలా నేర్చుకున్నానని స్పష్టం చేశారు. వైఫల్యం వల్లే విజయం రుచి ఏంటో తెలిసి వచ్చిందని అన్నారు. విజయంతో పునరాగమనం చేయడానికి ప్రధాన కారణం ప్రేక్షకులేనని, వారికి ఎల్లప్పుడు రుణపడి ఉంటానని స్పష్టం చేశారు.
అశ్నినీ దత్ కుమార్తేగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ స్వప్న దత్.. సప్నా సినిమాస్ పతాకంపై అద్భుతమైన విజయాలను అందుకున్న సినిమాలను రూపొందించారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, మెయిల్, సీతా రామం లాంటి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. త్వరలో అన్ని మంచి శకునములే చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు.
టాపిక్