Bigg Boss Elimination: బిగ్ బాస్‌లో రెండుసార్లు ఎలిమినేషన్- నిన్న తేజ, ఇవాళ పృథ్వీరాజ్ ఎలిమినేట్- ఎవరెలా సేవ్ అయ్యారంటే?-bigg boss telugu 8 thirteenth week double elimination tasty teja prithvi bigg boss 8 telugu elimination today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Elimination: బిగ్ బాస్‌లో రెండుసార్లు ఎలిమినేషన్- నిన్న తేజ, ఇవాళ పృథ్వీరాజ్ ఎలిమినేట్- ఎవరెలా సేవ్ అయ్యారంటే?

Bigg Boss Elimination: బిగ్ బాస్‌లో రెండుసార్లు ఎలిమినేషన్- నిన్న తేజ, ఇవాళ పృథ్వీరాజ్ ఎలిమినేట్- ఎవరెలా సేవ్ అయ్యారంటే?

Sanjiv Kumar HT Telugu
Dec 01, 2024 07:27 AM IST

Bigg Boss Telugu 8 Double Elimination Thirteenth Week: బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి అయింది. శనివారం టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వగా.. ఆదివారం పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేట్ కానున్నాడు. దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 8 డిసెంబర్ 1 ఎపిసోడ్ షూటింగ్ నిన్నే ఫినిష్ అయింది.

బిగ్ బాస్‌లో రెండుసార్లు ఎలిమినేషన్- నిన్న తేజ, ఇవాళ పృథ్వీరాజ్ ఎలిమినేట్- ఎవరెలా సేవ్ అయ్యారంటే?
బిగ్ బాస్‌లో రెండుసార్లు ఎలిమినేషన్- నిన్న తేజ, ఇవాళ పృథ్వీరాజ్ ఎలిమినేట్- ఎవరెలా సేవ్ అయ్యారంటే? (Disney Plus Hotstar/YouTube)

Bigg Boss 8 Telugu Double Elimination This Week: బిగ్ బాస్ తెలుగు 8 క్లైమాక్స్‌కు చేరుకుంది. వచ్చే వారం బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ ముగియనుందని తెలుస్తోంది. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియ పెట్టారు. దాంతో బిగ్ బాస్ నుంచి రెండు వికెట్స్ అవుట్ అయిపోయాయి.

డబుల్ ఎలిమినేషన్ పూర్తి

బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 30 ఎపిసోడ్‌లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయాడు. డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా శనివారం నాడు మొదటగా ఓటింగ్‌లో అతి తక్కువగా ఉన్న టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా శనివారం నాడే పూర్తి అయింది. దాంతో బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయింది.

బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం రెండోసారి ఎలిమినేషన్‌లో పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు. పృథ్వీ ఎలిమినేషన్‌ను బిగ్ బాస్ 8 తెలుగు డిసెంబర్ 1 ఎపిసోడ్‌లో ప్రసారం చేయనున్నారు. అంటే, ఈపాటికే షూటింగ్ పూర్తి అయిన ఈ ఎపిసోడ్ ఇవాళ ప్రసారం కానుంది. ఇకపోతే పృథ్వీరాజ్ తన ప్రవర్తనతో ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సింది.

చిన్నచూపు చూడటం

కానీ, పృథ్వీరాజ్‌ను విష్ణుప్రియ లవ్ చేయడం, కన్నడ బ్యాచ్‌కు నాగార్జున ఫేవరిజం చూపించడంతో ఇన్నాళ్లు సేవ్ అవుతూ వచ్చాడు. ఇక పృథ్వీరాజ్ ఎదుటివాళ్లను చిన్నచూపు చూస్తు తక్కువ అంచనా వేస్తూ అవమానించేవాడు. నామినేషన్స్‌లో ఇతరులకు ఫిజికల్ స్ట్రెంత్ లేదని, గేమ్స్ ఆడట్లేదని హేళనగా మాట్లాడేవాడు. కానీ, తమను అన్న పృథ్వీపైనే రోహిణి, అవినాష్‌లు ఫిజికల్ టాస్క్‌లు ఆడి గెలిచి పొగరు దించారు.

మరోవైపు పృథ్వీని విష్ణుప్రియ ఇష్టపడంతో ఆమె అభిమానులు అతన్ని నామినేషన్స్ నుంచే సేవ్ చేసి వచ్చారు. ఈసారి విష్ణుప్రియ కూడా నామినేషన్స్‌లో ఉండటంతో ఆమెకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. శనివారం నాటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ మొదటి ఫైనలిస్ట్ అయిన అవినాష్ నామినేషన్స్ నుంచి సేవ్ అయినట్లు హోస్ట్ నాగార్జున చెప్పాడు.

ఎవరెలా సేవ్ అయ్యారంటే?

ఇక బిగ్ బాస్ తెలుగు 8 డిసెంబర్ 1 ఎపిసోడ్‌లో మొదటగా గౌతమ్ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. ఆ తర్వాత రెండోసారి ప్రేరణ, మూడోసారి నిఖిల్, నాలుగో సారి నబీల్ సేవ్ అయ్యారు. ఇక ఫైనల్‌గా హౌజ్‌లో ప్రేమజంట విష్ణుప్రియ, పృథ్వీ మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. దీంట్లో ఎక్కువ ఓట్లతో విష్ణుప్రియ సేవ్ అయితే.. పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు.

ఇదిలా ఉంటే, ఇన్నాళ్లు హౌజ్‌లో ప్రేమ జంటగా ఉన్న విష్ణుప్రియ, పృథ్వీరాజ్ ఈ ఎలిమినేషన్‌తో విడిపోయింది. ఇకనుంచి విష్ణుప్రియ తన గేమ్‌పైనే ఫోకస్ పెడుతుందో చూడాలి. ఎంత ఫోకస్ పెట్టిన జరగాల్సిన నష్ట జరిగింది. టైటిల్ విన్నర్ రేస్‌లో ఉండాల్సిన విష్ణుప్రియ బాటమ్‌లో ఉండిపోయింది. అయితే, విష్ణుప్రియ ఎంతలా ట్రై చేసిన పృథ్వీ మాత్రం కేవలం ఫ్రెండ్షిప్ కొద్దే దగ్గర అయ్యాడు. అది కూడా విష్ణుకు క్లియర్‌గా చెప్పాడు.

హనీమమూన్‌కు వెళ్దాం

ఎన్ని చెప్పిన కూడా విష్ణుప్రియ మాత్రం పృథ్వీని ఆరాధించడం మానలేదు. ఇక బీబీ హోటల్ టాస్క్ సమయంలో అయితే హనీమూన్‌కు వెళ్దామని పృథ్వీరాజ్‌తో విష్ణుప్రియ అంది. ఆ టాస్క్‌లో వారిద్దరు లవర్స్‌గా చేశారు. అందులో భాగంగానే హనీమూన్‌కు వెళ్దామని పృథ్వీతో విష్ణుప్రియ అంది. మొత్తానికి అయితే బిగ్ బాస్ తెలుగు 8 డబుల్ ఎలిమినేషన్‌లో టేస్టీ తేజ, పృథ్వీ ఎలిమినేట్ అయ్యారు. దాంతో ప్రేమజంట విష్ణు, పృథ్వీ విడిపోయినట్లు అయింది.

Whats_app_banner