Sankranthiki Vasthunnam: వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’నుంచి మరో అప్‌డేట్.. ప్రొమో రిలీజ్‌తో సర్‌ప్రైజ్
Godari Gattu Song Promo Release: సంక్రాంతి రేసులో ఉన్న వెంకటేశ్ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. గోదారి గట్టు పాట ప్రొమోను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. రమణ గోగుల వాయిస్‌తో అంచనాల్ని పెంచేస్తోంది.
సీనియర్ హీరో వెంకటేశ్ నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. వెంకటేశ్ సరసన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రయూనిట్.. శనివారం ఒక సాంగ్ ప్రొమోని రిలీజ్ చేసింది.
సాంగ్ ప్రొమో రిలీజ్
మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ రమణ గోగుల పాడిన ‘ గోదారి గట్టు మీద రామసిలకవే.. గోరింటాకెట్టుకున్న సందమామవే’ అంటూ సరదాగా సాగే ఈ పాటకి సంబంధించిన ప్రొమోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్ రొమాంటిక్‌గా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ పాటని పూర్తి రిలిక్స్‌తో డిసెంబరు 3న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రొమోలో చూపించారు.
రమణ గోగులతో గొంతు కలపనున్న మధుప్రియ
రమణ గోగులతో కలిసి ఈ పాటని తెలంగాణ ఫోక్ సింగర్ మధుప్రియ పాడబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాలకి లెక్కకి మించి పాటలు పాడిన రమణ గోగుల.. చాలా రోజుల తర్వాత మళ్లీ పాట పాడుతుండటంతో ఈ సాంగ్‌పై అంచనాలు పెరిగిపోయాయి. భాస్కరభట్ల ఈ సాంగ్‌కి లిరిక్స్ అందించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సినిమాని నిర్మిస్తున్నారు.
సంక్రాంతికి రేసులో మూడు పెద్ద సినిమాలు
2025 సంక్రాంతి రేసులో ఇప్పటికే రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్, నందమూరి బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ ఉన్నాయి. ఈ రెండింటితో పాటు సంక్రాంతికి వస్తున్నాం కూడా రేసులోకి వచ్చింది. 2019లోనూ ఇదే తరహాలో సంక్రాంతికి ఈ ముగ్గురు హీరోలు పోటీపడటం గమనార్హం.