OTT Trending: ఓటీటీలో అదరగొడుతోన్న 29 కోట్ల కన్నడ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!
Bagheera OTT Streaming Trending: ఓటీటీలోకి ఇటీవల డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన సూపర్ హిట్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ సినిమా బఘీరా అదరగొడుతోంది. సూపర్ హీరో మూవీ జోనర్‌లో వచ్చిన బఘీర ఓటీటీ రిలీజ్ అయిన ఒకట్రెండు రోజుల్లోనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో ఎక్కడ చూడాలో ఓ లుక్కేయండి.
Bagheera OTT Trending: సౌత్‌లో సూపర్ హీరో సినిమాలు రావడం చాలా అరుదుగా వస్తుంటాయి. దక్షిణాది భాషల్లో ఏ ఒక్కదాంట్లో వచ్చిన సరే సూపర్ హీరో సినిమాలు తెలుగులోనూ రిలీజ్ చేస్తుంటారు. అలా, ఇటీవల కన్నడలో వచ్చిన సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ బఘీర.
సక్సెస్‌ఫుల్ బ్యానర్‌లో
ఉగ్రమ్ సినిమాతో శాండల్‌వుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి ఫేమ్ తెచ్చుకున్న రోరింగ్ స్టార్ శ్రీమురళి యాక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీనే బఘీర. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించిన బఘీర సినిమాకు డాక్టర్ సూరి తెరకెక్కించారు. అలాగే, కేజీఎఫ్, కాంతార చిత్రాలతో సూపర్ సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న హోంబలే ఫిలీంస్ ఈ సినిమాను నిర్మించింది.
యాక్షన్ సన్నివేశాలు
విజయ్ కిరగందూర్ నిర్మాతగా వ్యవహరించిన బఘీర సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పీ రిలీజ్ చేసింది. అక్టోబర్ 31న దివాళీ కానుకగా థియేటర్లలో విడుదలైన బఘీర సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో యాక్షన్ సీన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగున్నాయని టాక్ వచ్చింది. దాంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది బఘీర మూవీ.
20 కోట్ల బడ్జెట్-29 కోట్ల కలెక్షన్స్
రూ. 20 కోట్లతో బఘీర సినిమాను రూపొందిస్తే రూ. 29 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. ఇలా మంచి క్రేజ్ తెచ్చుకున్న బఘీర మూవీ ఓటీటీలోకి 20 రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. నవంబర్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో బఘీర ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా కన్నడతోపాటు తెలుగులో బఘీర ఓటీటీ రిలీజ్ అయింది.
ఒక్కరోజులోనే ఓటీటీ ట్రెండింగ్
ఆ తర్వాతి రోజే అంటే నవంబర్ 22 నుంచి తమిళం, మలయాళం భాషల్లో కూడా బఘీర అందుబాటులోకి వచ్చేసింది. ఆ తర్వాత ఒక్కరోజులోనే ఓటీటీ ట్రెండింగ్‌లోకి దూసుకొచ్చింది ఈ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ బఘీర. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ స్థానాల్లో టాప్ 2 ప్లేస్ దక్కించుకుని అదరగొడుతోంది. అయితే, టాప్ 1లో మాత్రం "నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్" డాక్యుమెంటరీ మూవీ ట్రెండింగ్ అవుతోంది.
తెలుగు ఓటీటీ ఆడియెన్స్ నుంచి
థియేటర్లలో మిస్ అయిన వాళ్లు బఘీర సినిమాను ఓటీటీలో వీక్షిస్తున్నారు. బఘీర సినిమాకు తెలుగు రాష్ట్రాల ఓటీటీ ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, బఘీర సినిమాలో శ్రీమురళికి జోడీగా హీరోయిన్ రుక్మిణి వసంత్ నటించింది. అలాగే, ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.
కఠినంగా శిక్షించే పోలీస్ ఆఫీసర్
అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించిన బఘీర సినిమా కథ విషయానికొస్తే.. హీరో ఒక టఫ్ పోలీసు ఆఫీసర్. స్త్రీలకు హాని కలిగించే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు. హీరోయిన్ సున్నితమైన ప్రవర్తన కలిగిన డాక్టర్. అమాయకులను విలన్స్ నుంచి హీరో ఎలా కాపాడాడు అనే సింపుల్ స్టోరీని థ్రిల్లింగ్ సీన్స్‌తో తెరకెక్కించారు.
టాపిక్