Bigg Boss Remuneration: బిగ్ బాస్ నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్.. 2 నెలల్లో జబర్దస్త్ కమెడియన్ ఎన్ని లక్షలు సంపాదించడంటే?
Bigg Boss Telugu 8 Tasty Teja Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 30 ఎపిసోడ్ షూటింగ్ ఈపాటికే పూర్తి అయింది. ఈ నేపథ్యంలో హౌజ్‌లో 2 నెలలు ఉన్న టేస్టీ తేజ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో చూద్దాం.
Bigg Boss 8 Telugu Tasty Teja Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. అందుకే ఈ వారం హౌజ్ కంటెస్టెంట్స్ మధ్య టికెట్ టు ఫినాలే టాస్క్ పెట్టడమే కాకుండా బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియను తీసుకొచ్చారు.
ఈ వారం డబుల్ ఎలిమినేషన్
గత వారమే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెగ వార్తలు వచ్చాయి. కానీ, బిగ్ బాస్ 8 తెలుగు 12వ వారం మాత్రం సింగిల్ ఎలిమినేషన్‌లో యష్మీ గౌడ ఒక్కరే ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. దాంతో బిగ్ బాస్ తెలుగు 8 13వ వారం మాత్రం కచ్చితంగా రెండు సార్లు ఎలిమినేషన్ ఉంటుందని టాక్ జోరుగా నడిచింది. అయితే, ఆ టాక్ ప్రకారమే బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అవనుంది.
ఇవాళ టేస్టీ తేజ ఎలిమినేట్
బిగ్ బాస్ తెలుగు 8కు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన వారంలో ఒకసారి డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇప్పుడు 8 వారాల తర్వాత రెండోసారి డబుల్ ఎలిమినేషన్ నిర్వహించనున్నారు. అయితే, బిగ్ బాస్ 8 తెలుగు నుంచి ఇవాళ టేస్టీ తేజ ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడి వెళ్లిపోయాడు. దానికి సంబందించిన ఎపిసోడ్ షూటింగ్ ఈపాటికే పూర్తి అయిపోయింది.
వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ
బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 30 అంటే ఇవాళ టేస్టీ తేజ ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను ప్రసారం చేయనున్నారు. డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా శనివారం నాడు అతి తక్కువ ఓటింగ్ తెచ్చుకున్న టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‌లో తన ఆటతో పర్వాలేదనిపించుకున్న పాత జబర్దస్త్ కమెడియన్, ఫుడ్ బ్లాగర్ టేస్టీ తేజ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి అక్టోబర్ 6న అడుగుపెట్టాడు.
హౌజ్‌లో తల్లిని చూడాలనే కోరిక
బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌లోకి అడుగుపెట్టిన టేస్టీ తేజ కామెడీతోనే కాకుండా ఆటపరంగా కూడా ఆకట్టుకున్నాడు. లావు ఉన్న కారణంగా టాస్క్‌లో వెనుకబడినప్పటికీ తన బెస్ట్ ఇచ్చి అట్రాక్ట్ చేశాడు. అంతేకాకుండా ఫ్యామిలీ వీక్‌లో తన తల్లిని బిగ్ బాస్ హౌజ్‌లో చూడాలనే కోరికను కూడా నెరవేర్చుకున్నాడు. అయితే, టికెట్ టు ఫినాలే సాధించి బిగ్ బాస్ ఫైనల్స్‌లోకి వెళ్లేందుకు బాగానే ట్రై చేసిన టేస్టీ తేజ సక్సెస్ కాలేకపోయాడు.
8 వారాలు- 12 లక్షలు
ఇదిలా ఉంటే, బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో అక్టోబర్ 6 హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన టేస్టీ తేజ 8 వారాల (56 రోజులు) పాటు ఉన్నాడు. అంటే సరిగ్గా 2 నెలలు ఉన్నాడు. బిగ్ బాస్ తెలుగు 8లో పాల్గొన్నందుకు టేస్టీ తేజ వారానికి రూ. లక్ష యాభైవేలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో బిగ్ బాస్ 8 తెలుగు ద్వారా టేస్టీ తేజ రెండు నెలల్లో రూ. 12 లక్షల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.
టేస్టీ తేజ రెమ్యునరేషన్
అయితే, టేస్టీ తేజ వారానికి రూ. 4 లక్షల పారితోషికం తీసుకున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ద్వారా 2 నెలల్లో టేస్టీ తేజ రూ. 32 లక్షల డబ్బు సంపాదించినట్లు అర్థం చేసుకోవచ్చు.