TGPSC : టీజీపీఎస్సీకి ఛైర్మన్‌ను నియమించేందుకు నోటిఫికేషన్‌.. ఇలా దరఖాస్తు చేయండి-notification released for the appointment of telangana public service commission chairman ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc : టీజీపీఎస్సీకి ఛైర్మన్‌ను నియమించేందుకు నోటిఫికేషన్‌.. ఇలా దరఖాస్తు చేయండి

TGPSC : టీజీపీఎస్సీకి ఛైర్మన్‌ను నియమించేందుకు నోటిఫికేషన్‌.. ఇలా దరఖాస్తు చేయండి

Basani Shiva Kumar HT Telugu
Nov 12, 2024 04:25 PM IST

TGPSC : టీజీపీఎస్సీకి కొత్త ఛైర్మన్‌ను నియమించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను www.telangana.gov.in వెబ్ సైట్‌లో పొందుపర్చారు. స్క్రీనింగ్‌ కమిటీ దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేస్తుందని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ పదవికి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రస్తుత ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డి పదవీకాలం వచ్చేనెల 3తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డి స్థానంలో మరొకరిని నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ఫాం, అర్హతలు, ఇతర వివరాలు www.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఛైర్మన్ పదవి కోసం పూర్తిచేసిన దరఖాస్తులను ఈనెల 20వతేదీ సాయంత్రం 5 గంటల్లోగా prlsecy-ser-gpm-gad@telangana.gov.in కు పంపించాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం నియమించిన స్క్రీనింగ్‌ కమిటీ.. ఈ దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేస్తుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

సగం ఖాళీ..

ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసే టీజీపీఎస్సీ త్వరలోనే సగం ఖాళీకానుంది. కమిషన్‌ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డికి 62 ఏళ్లు వస్తాయి. ఆ పదవి నుంచి రిటైర్మెంట్‌ పొందనున్నారు. ఆ తర్వాత మూడు, నాలుగు నెలల వ్యవధిలోనే కమిషన్‌ సభ్యురాలు అనితారాజేంద్ర, ఆ తర్వాత రామ్మోహన్‌రావు వరుసగా పద వీవిరమణ పొందనున్నారు. దీంతో టీజీపీఎస్సీ సగానికి పైగా ఖాళీకానుంది.

టీజీపీఎస్సీకి కొత్తగా 142 పోస్టులను క్రియేట్‌ చేస్తూ.. ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. వీటిలో 73 పోస్టులను కొత్తగా రిక్రూట్‌ చేయనుండగా.. 58 పోస్టులను ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై ఫిల్ చేయనున్నారు. మిగతా 11 పోస్టులను పదోన్నతులిచ్చి నింపుతారని తెలుస్తోంది.

డిప్యుటేషన్‌పై పోస్టులు ఇవే..

అడిషనల్‌ సెక్రటరీ -1, డిప్యూటీ సెక్రటరీ -3, అసిస్టెంట్‌ సెక్రటరీ -2, సెక్షన్‌ ఆఫీసర్‌ -4, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ – 5, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు -1, చీఫ్‌ అనలెటిక్‌ ఆఫీసర్‌ -1, అనలెటికల్‌ ఆఫీసర్‌ -2, డిప్యూటీ అనలెటికల్‌ ఆఫీసర్‌ -4, అసిస్టెంట్‌ అనలెటికల్‌ ఆఫీసర్‌ -8, లా ఆఫీసర్‌ -1, ప్రొఫెసర్‌ -3, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ -1, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ -5, అడిషనల్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామ్స్‌ -2, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ -1, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ -1, ప్రోగ్రామర్‌ -3, జూనియర్‌ ప్రోగ్రామర్‌ -4, స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ -4, డిప్యూటీ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ -2.

Whats_app_banner