TGPSC DAO Key : టీజీపీఎస్సీ డీఏఓ పోస్టుల భర్తీ, ఈ నెల 31న ప్రాథమిక కీ విడుదల
TGPSC DAO Key : టీజీపీఎస్సీ డీఏఓ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ప్రైమరీ కీ ఈ నెల 31న విడుదల చేయనుంది. ఈ మేరకు కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
TGPSC DAO Key : టీజీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(గ్రేడ్-2) పరీక్షల ప్రాథమిక కీ ని ఈ నెల 31న విడుదల చేయనుంది. టీజీపీఎస్సీ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్‌లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ –II పోస్టులకు 2022లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఈ ఏడాది జూన్ 30 నుంచి జులై 4 వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష ప్రైమరీ కీని జులై 31 విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్పీ ప్రకటించింది. ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్‌లు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in అందుబాటులో ఉంచనుంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ నెల 31న కీ, రెస్పాన్స్ షీట్ లు చెక్ చేసుకోవచ్చు. రెస్పాన్ షీట్లు ఆగస్టు 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ పేర్కొంది.
ఆగస్టు 1 నుంచి 5 వరకు అభ్యంతరాలు స్వీకరణ
ఆగస్టు 1 నుంచి 5వ తేదీ వరకు ప్రాథమిక కీపై అభ్యర్థులు అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను వెబ్ సైట్ లో ఇచ్చిన టెక్స్ట్ బాక్స్ లో ఇంగ్లీష్ లో తెలియజేయాల్సి ఉంటుంది. ఈ-మెయిల్స్, వ్యక్తిగతంగా సమర్పించిన అభ్యంతరాలను పరిగణించమని కమిషన్ తెలిపింది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం https://www.tspsc.gov.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
53 పోస్టుల భర్తీ
తెలంగాణ వర్క్స్ అకౌంట్స్ శాఖలో 53 డీఏఓ పోస్టుల భర్తీకి 2022 ఆగస్టు 4న నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 53 పోస్టుల్లో ఓసీ-19, ఈడబ్ల్యూఎస్-05, బీసీ-14, ఎస్సీ-09, ఎస్టీ-04, దివ్యాంగులు-02 కేటాయించారు. టీజీపీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో గత రెండేళ్లలో కమిషన్ విడుదల చేసిన పలు పరీక్షలు రద్దయ్యాయి. ఈ పోస్టులకు 2022 ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 6 వరకు దరఖాస్తులు స్వీకరించింది. 2023 ఫిబ్రవరి 20న రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల చేసి, ఫిబ్రవరి 26న పరీక్ష నిర్వహించింది. అయితే పేపర్ లీకేజీ వ్యవహారంతో డివిజనల్ అకౌంట్స్ అధికారి(డీఏఓ) పరీక్షను వాయిదా పడింది. తిరిగి ఈ పరీక్షలను ఈ ఏడాది జూన్ 30 నుంచి పరీక్షలు నిర్వహించారు. జులై 31న ప్రైమరీ కీ విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.
సింగరేణి ఉద్యోగాలు
సింగరేణి యాజమాన్యం మార్చి నెలలో విడుదల చేసిన ఎక్స్‌టర్నల్ సెకండ్ నోటిఫికేషన్‌లో భాగంగా ఏడు విభాగాల్లో 327 పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఈ ఉద్యోగ రాత పరీక్షలను సింగరేణి యాజమాన్యం ఖరారు చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షలు ఆగస్టు 6, 7 తేదీల్లో జరుగుతాయని పేర్కొంది. 7 రకాల కేటగిరీ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. https://scclmines.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్ల డౌన్లోడ్ తో పాటు పరీక్షల షెడ్యూల్ ను చెక్ చేసుకోవచ్చని వివరించింది. షెడ్యూల్ ప్రకారం మొదటి రోజు అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రెయినీ (ఎలక్ట్రికల్) టీఅండ్‌ఎస్ గ్రేడ్ –సీ, జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రెయినీ, ఎలక్ట్రీషియన్ ట్రెయినీ కేటగిరీ– 1, ఫిట్టర్ కేటగిరీ –1 పరీక్షలను నిర్వహించనున్నరు. ఇక రెండో రోజు అంటే ఆగస్టు 7వ తేదీన మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఈఅండ్‌ఎం) ఈ –2 గ్రేడ్, మేనేజ్‌మెంట్ ట్రెయినీ (సిస్టమ్) ఈ–2 గ్రేడ్, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రెయినీ (మెకానికల్) టీఅండ్‌ఎస్ గ్రేడ్ – సీ పరీక్షలు జరగనున్నాయి.
సంబంధిత కథనం