TSPSC DAO Edit Option : డీఏఓకు అప్లై చేశారా? ఎడిట్ అప్షన్ ఇచ్చారు.. చూసుకున్నారా?-edit option for tspsc divisional accounts officer posts application here is process ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Dao Edit Option : డీఏఓకు అప్లై చేశారా? ఎడిట్ అప్షన్ ఇచ్చారు.. చూసుకున్నారా?

TSPSC DAO Edit Option : డీఏఓకు అప్లై చేశారా? ఎడిట్ అప్షన్ ఇచ్చారు.. చూసుకున్నారా?

HT Telugu Desk HT Telugu
Oct 19, 2022 12:16 PM IST

TSPSC Divisional Accounts Officer Edit Option : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) డీఏఓ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుటు దరఖాస్తు సమయం ముగిసిపోయింది. అయితే తాజాగా ఎడిట్ అప్షన్ ఇచ్చింది టీఎస్పీఎస్సీ.

<p>టీఎస్పీఎస్సీ ఎడిట్ ఆప్షన్</p>
టీఎస్పీఎస్సీ ఎడిట్ ఆప్షన్ (tspsc.in)

డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌(Director of Works and Accounts Department)లోని డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-II పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు టీఎస్‌పీఎస్‌సీ ఎడిట్ ఆప్షన్‌ను అందించింది. సమాచారాన్ని తప్పుగా నమోదు చేసిన అభ్యర్థులు, కమిషన్ వెబ్‌సైట్ www.tspsc.gov.in లో అక్టోబర్ 18 ఉదయం 10 గంటల నుండి అక్టోబర్ 20 సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్(Edit Option) సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని టీఎస్పీఎస్సీ చెప్పింది.

TSPSC డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్స్‌ విభాగంలో 53 డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (DAO) గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆగ‌స్టు 17 నుంచి సెప్టెంబరు 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆ సమయంలో ఎవరైనా వివరాలు తప్పుగా నమోదు చేసి ఉంటే.. మళ్లీ ఎడిట్ అప్షన్ లోకి వెళ్లి సవరించుకోవచ్చు.

అప్లై చేసిన వారికి.. వయోపరిమితి 18 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలుగా టీఎస్పీఎస్సీ(TSPSC) నిర్ణయించింది. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. విద్యార్హతల విషయానికొస్తే, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా ఏదైనా సమానమైన అర్హతలను కలిగి ఉండాలి. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అన్ని కేటగిరీ అభ్యర్థులకు రూ.200గా ఉంది. ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్ష ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పరీక్షను డిసెంబర్‌లో నిర్వహిస్తారు. పరీక్షకు కొన్ని రోజులు ముందు హాల్ టికెట్ ఇష్యూ చేస్తారు.

ఎలా ఎడిట్ చేయాలంటే..

అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inకు వెళ్లాలి.

వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న DAO ఎడిట్ అప్షన్ లింక్‌పై క్లిక్ చేయండి

మీ లాగిన్ ID, పుట్టిన తేదీని నమోదు చేయాలి.

వెంటనే ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సిన వివరాలను ఎడిట్ చేసుకోవాలి.

Whats_app_banner