TSPSC Job Notification : టీఎస్పీఎస్సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్
టీఎస్పీఎస్సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. మహిళా, శిశు సంక్షేమాధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 13 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు.
టీఎస్పీఎస్సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మహిళా, శిశు సంక్షేమాధికారి పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. సెప్టెంబర్ 13 నుంచి దరఖాస్తులు చేయాలి. మొత్తం 23 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అక్టోబర్ 10న దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు.
తెలంగాణలో ఇప్పటికే పలు పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు లభించిన విషయం తెలిసిందే. తాజాగా 23 మహిళా, శిశు సంక్షేమాధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మల్టీజోన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. మల్టీ జోన్ 1 లో 17 పోస్టులు ఉన్నాయి. మల్టీ జోన్ 2 లో 6 పోస్టులుగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 51,320 నుంచి రూ. 1,27,310 వరకు జీతం ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. హోం సైన్స్ లేదా సోషల్ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు అయి ఉండాలి. బోటనీ, బయాలజీ, బయో కెమిస్ట్రీతో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారుపోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
1540 AEE Jobs 2022 Notification: ఇటీవలే 1540 ఏఈఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 న విడుదల అవుతుందని ఆ నోటీస్ లో పేర్కొంది.
ఏఈఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 22 నుంచి దరఖాస్తులు మొదలు కానున్నాయి. అక్టోబర్ 14, 2022 వరకు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో స్వీకరించనున్నారు. మొత్తం 1540 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నియామక పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో ఉండే అవకాశం ఉంది. పూర్తి నోటిఫికేషన్ ను సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
ముఖ్య వివరాలు:
AEE Jobs Details: అసిట్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) సివిల్ పీఆర్ అండ్ ఆర్ డీ డిపార్ట్ మెంట్(మిషన్ భగీరథ) లో 302 పోస్టులు
ఏఈఈ సివిల్ విభాగం 211 పోస్టులు, ఏఈఈ సివిల్ ఎంఏ అండ్ యూడీ పీహెచ్ విభాగంలో 147 పోస్టులు
టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్ లో 15, ఐ అండ్ సీడీ డిపార్ట్ మెంట్లో మొత్తం 704 ఖాళీలు (సివిల్ 320, మెకానికల్ 84, ఎలక్ట్రికల్ 200, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో 100)
ఏఈఈ మెకానికల్ ఐ అండ్ సీఏడీ డిపార్ట్ మెంట్ లో 03, ఏఈఈ (సివిల్) టీఆర్ అండ్ బీ విభాగంలో 145 ఉద్యోగాలు
ఏఈఈ ఎలక్ట్రికల్ టీఆర్ అండ్ బీ విభాగంలో 13 పోస్టులు
అర్హతలు - సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్ విభాగంలో ఇంజనీరింగ్/ మెకానికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ఆయా పోస్టులను బట్టి అర్హతులు ఉంటాయి.
వయోపరిమితి - అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం - నెలకు రూ.54220 నుంచి రూ. 1,33,630 మధ్య ఉంటుంది.
దరఖాస్తుల స్వీకరణ - సెప్టెంబర్ 22, 2022
తుది గడువు - 14, అకోబ్టర్, 2022
పరీక్ష - డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహించే అవకాశం