ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( FCI ) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది, కేటగిరీ 3 కింద నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ fci.gov.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 5043 ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబరు 06, 2022 నుండి ప్రారంభమవుతుంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఉండే అన్ని దశలలో అభ్యర్థి హాజరు కావాలి. ఆన్‌లైన్ పరీక్షలు ద్విభాషలో ఉంటాయి. కొన్ని డాక్యుమెంట్స్ మినహా అన్ని ఇంగ్లీష్, హిందీలోనే ఉంటాయి. “అభ్యర్థి దరఖాస్తు చేసే పోస్ట్, జోన్ పరిధిలోని పోస్ట్‌కు అతని/ఆమె మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడుతారు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 05, 2022. అభ్యర్థులు ముఖ్యమైన తేదీలు, ఖాళీ వివరాలు, ఇతర వివరాలను ఇక్కడ చెక్ చేయవచ్చు.
ఫీజు చెల్లింపుతో పాటు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ సమర్పణ ప్రారంభం: సెప్టెంబర్ 06, 2022, 10:00 గంటల నుండి (IST)
ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి, ఫీజు చెల్లింపుకు చివరి తేదీ & సమయం: అక్టోబర్ 05, 2022 16:00 గంటల వరకు (IST)
వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డ్‌ల డౌన్‌లోడ్ : ప్రకటించిన పరీక్ష తేదీకి 10 రోజుల ముందు
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: https://www.fci.gov.in వెబ్‌సైట్‌లో ప్రకటించబడుతుంది. తాత్కాలికంగా జనవరి 2023లో నిర్ణయించారు.
FCI రిక్రూట్‌మెంట్ 2022 అర్హతలు, అనుభవం, ఎంపిక ప్రమాణాలు, ఇతర వివరాల గురించి మీరు తెలుసుకోవలసినవి ఇక్కడ ఉన్నాయి,
నార్త్ జోన్ : 2388 పోస్టులు
సౌత్ జోన్ : 989 పోస్టులు
ఈస్ట్ జోన్: 768 పోస్టులు
వెస్ట్ జోన్ : 713 పోస్టులు
NE జోన్: 185 పోస్టులు
J.E. (Civil Engineering): సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతోపాటు ఏడాది అనుభవం ఉండాలి.
J.E. (Electrical Mechanical): ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతోపాటు ఏడాది అనుభవం ఉండాలి. లేదా మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతోపాటు ఏడాది అనుభవం ఉండాలి.
Steno. Grade- II: ఇంగ్లీష్ టైపింగ్ మరియు షార్ట్‌హ్యాండ్‌లో వరుసగా 40 wpm మరియు 80 wpm వేగంతో గ్రాడ్యుయేట్ డిగ్రీ.
AG-III (General): కంప్యూటర్ల వినియోగంలో నైపుణ్యంతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ.
AG-III (Accounts): కంప్యూటర్ల వినియోగంలో నైపుణ్యంతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్.
పైన పేర్కొన్న పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు దిగువ ఇచ్చిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా విద్యార్హత, ఎంపిక విధానాన్ని చెక్ చేయవచ్చు.
డైరెక్ట్ లింక్: FCI Category 3 Recruitment Notification
ఆసక్తి గల అభ్యర్థులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( FCI ) అధికారిక వెబ్‌సైట్ fci.gov.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు . అభ్యర్థులు మరింత సమాచారం కోసం FCI వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
సంబంధిత కథనం