TSPSC Group Jobs: గ్రూప్ -2 ,3 ఉద్యోగాల భర్తీపై టీఎస్‌పీఎస్సీ కీలక ఆదేశాలు-tspsc key meeting on group 2 and group 3 posts recruitment ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tspsc Key Meeting On Group 2 And Group 3 Posts Recruitment

TSPSC Group Jobs: గ్రూప్ -2 ,3 ఉద్యోగాల భర్తీపై టీఎస్‌పీఎస్సీ కీలక ఆదేశాలు

Mahendra Maheshwaram HT Telugu
Sep 02, 2022 09:56 PM IST

tspsc group posts 2022: గ్రూప్ -2, గ్రూప్ -3 తో పాటు ఇతర ఉద్యోగాల భర్తీపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమావేశం నిర్వహించింది. వీలైనంత త్వరగా ఆయాశాఖల అధికారులు పూర్తి ఇండెంట్లు టీఎస్‌పీఎస్సీకి సమర్పించాలని కోరారు

ఉద్యోగాల భర్తీపై టీఎస్పీఎస్సీ సమావేశం
ఉద్యోగాల భర్తీపై టీఎస్పీఎస్సీ సమావేశం (tspsc.in)

Telangana Group 2 and 3 Jobs: తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే గ్రూప్ 2, 3 నోటిఫికేష‌న్లు రానున్నాయి. ఇప్ప‌టికే గ్రూప్‌-2 కింద 663 పోస్టులు, గ్రూప్‌-3 కింద 1373 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమ‌తి ఇచ్చింది. దీంతో ఈ పోస్టుల భ‌ర్తీపై టీఎస్‌పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేసింది. శుక్రవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయా శాఖల హెచ్‌వోడీలతో ప్రత్యేక సమావేశం నిర్వ‌హించారు. సుమారు 100 మంది అధికారులు తమ శాఖల పరిధిలోని ఖాళీలు, సమస్యలు, తదితర అంశాల గురించి వివరించారు.

ట్రెండింగ్ వార్తలు

TSPSC Group Jobs 2022: సర్వీస్‌ రూల్స్‌, సవరణలు, క్లారిఫికేషన్లు, రోస్టర్‌ విధానం, ఫార్వర్డ్‌ ఖాళీలు, అర్హతలు, తదితర విషయాలన్నీ టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ద‌న్‌రెడ్డి వారికి వివరించారు. ఆ తర్వాత వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జనార్ద‌న్‌రెడ్డి మాట్లాడుతూ… త్వరితగతిన గ్రూప్‌-2, 3 ఉద్యోగాలకు నోటిఫికేన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. అన్ని శాఖల అధికారుల సహకారంతోనే ఇది సాధ్యమని చెప్పారు. వీలైనంత త్వరగా ఆయాశాఖల అధికారులు పూర్తి ఇండెంట్లు టీఎస్‌పీఎస్సీకి సమర్పించాలని కోరారు. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

<p>గ్రూప్ ఉద్యోగాల భర్తీపై టీఎస్‌పీఎస్సీ సమీక్ష,</p>
గ్రూప్ ఉద్యోగాల భర్తీపై టీఎస్‌పీఎస్సీ సమీక్ష, (tspsc)

ఈ వారంలోనే 2,910 పోస్టులకు పచ్చజెండా ఊపింది. 663 గ్రూప్‌-2 ఉద్యోగాలు, 1373 గ్రూప్‌-3 ఉద్యోగాల భర్తీ చేసేందుకు అనుమతించింది. పశుసంవర్థక శాఖలో 294, గిడ్డంగుల సంస్థలో 50, విత్తన ధ్రువీకరణ సంస్థలో 25 పోస్టులతోపాటు పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేయనుంది. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ.. ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రూప్​-2 ఉద్యోగాల్లో జీఏడీ ఏఎస్ఓ పోస్టులు 165, పంచాయతీరాజ్ ఎంపీఓ పోస్టులు 125, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 98, ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులు 97, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు 59 ఉన్నాయి. 38 చేనేత ఏడీఓ పోస్టులు, 25 ఆర్థికశాఖ ఏఎస్ఓ పోస్టులు, 15 అసెంబ్లీ ఏఎస్ఓ పోస్టులు, 14 గ్రేడ్ టూ సబ్ రిజిస్ట్రార్ పోస్టులు, 11 గ్రేడ్ త్రీ మున్సిపల్ కమిషనర్ పోస్టులు, తొమ్మిది ఏఎల్ఓ, ఆరు న్యాయశాఖ ఏఎస్ఓ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.

గ్రూప్-3 ఉద్యోగాల్లో మొత్తం 99 విభాగాధిపతులు, కేటగిరీల పరిధిలో 1373 జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది. వ్యవసాయశాఖలో 199 గ్రేడ్-2 ఏఈఓ పోస్టులు, 148 ఏఓ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఉద్యానవన శాఖలో 21 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. సహకారశాఖలో 63 అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నాయి. 36 జూనియర్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.

పశుసంవర్ధకశాఖలో 183 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, 99 వెటర్నరీ అసిస్టెంట్ సహా 294 పోస్టుల భర్తీకి అనుమతి మంజూరైంది. విత్తన ధృవీకరణ సంస్థలో 19 సీడ్ సర్టిఫికేషన్ అధికారి, ఆరు ఆర్గానిక్ ఇన్ స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మత్య్సశాఖలో తొమ్మిది ఎఫ్​డీఓ, నాలుగు ఏడీ, రెండు అసిస్టెంట్ ఇన్​స్పెక్టర్ పోస్టులు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకుల పరిధిలో 12 పోస్టులు ఉంటాయి. ఇంధనశాఖలో 11 సహాయ ఎలక్ట్రికల్ పోస్టులు, గిడ్డంగుల సంస్థలో 28 ఏడబ్ల్యూఎం, 14 మేనేజర్ సహా 50 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ అనుమతితో ఉద్యోగాల నియామక ప్రక్రియలో 50 వేల మైలురాయిని అధిగమించినట్లు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు.

IPL_Entry_Point

టాపిక్