గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేత..-interviews cancellation for group 1 and group 2 jobs in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Interviews Cancellation For Group 1 And Group 2 Jobs In Telangana

గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేత..

HT Telugu Desk HT Telugu
Apr 12, 2022 09:04 PM IST

గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్వ్యూ లేదని తెలిపింది.

గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేత
గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేత

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి.. గుడ్ న్యూస్ వచ్చింది. గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్వ్యూలు అవసరం లేదనే ప్రతిపాదన మంత్రివర్గం ముందుకు వచ్చింది. దీనిపై చర్చించిన అనంతరం.. ఇంటర్వ్యూ అవసరం లేదని ఆమోదం తెలిపింది. మరోవైపు.. పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి మరో మూడేళ్లు పెంచారు.

ఇప్పటి వరకు గ్రూప్-1 కు సంబంధించి ఇంటర్వ్యూలకు 100 మార్కులు ఉండేవి. మరోవైపు గ్రూప్-2కు సంబంధించి 75 మార్కులు ఉండేవి. ఇంటర్వ్యూల విషయంలో ఎప్పటి నుంచో విమర్శలతోపాటు ఆరోపణలు ఉన్నాయి. ప్రతిభ కలిగిన వారికి అన్యాయం జరుగుతుందనేది కొంతమది వాదనగా ఉంది. ఇంటర్వ్యూల్లో అవినీతి జరుగుతుంద‌ని కూడా వ్యాఖ్యానించేవారు ఉన్నారు. ప్రతిభ కలిగిన అభ్యర్థులు.. అన్యాయం జరుగుతుందని.., ఇంటర్వ్యూలను రద్దు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి.

ఇలాంటి సమయంలో.. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల ఎంపికపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెలక్షన్ ప్రాసెస్ లో మార్పులు చేయడానికి సిద్ధమైంది. అసలు ఇంటర్వ్యూలే ఎత్తివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో సమయం కూడా ఆదా అవుతుంది. అవినీతి ఆరోపణలు తావు లేకుండా అవుతుంది.

ఒకవేళ అన్ని కుదిరితే... ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల అవుతుంది. జూలై చివరి వారం లేదా ఆగస్టు మొద‌టి వారంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 90 రోజులు ప్రిపరేషన్ సమయం ఇవ్వాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పరీక్ష నిర్వహించిన 30 రోజుల్లోనే ఫలితాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్