TS Govt Jobs: తెలంగాణలో మరో 10,105 ఉద్యోగాలు.. భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి
Jobs in Telangana: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Jobs in Telangana 2022: అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన నాటి నుంచి వరుస నోటిఫికేషన్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రూప్ 1, పోలీసు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కూడా ఆహ్వానించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చేసింది. పలు శాఖల్లో ఖాళీగా ఉన్న 10,105 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఇందులో అత్యధికంగా గురుకులాల్లోనే 9,096 పోస్టులు ఉన్నాయి.
వివరాలివే....
బీసీ గురుకులాలు- 3,870
గిరిజన గురుకులాలు- 1,514,
ఎస్సీ గురుకులాలు- 2,267
ఎస్సీ అభివృద్ధిశాఖ- 316,
మహిళా శిశుసంక్షేమశాఖ- 251
బీసీ సంక్షేమ శాఖ - 157,
గిరిజన సంక్షేమ శాఖ - 78
దివ్యాంగ శాఖ - 71
జువైనల్ వెల్ఫేర్ - 66 పోస్టులు
ఇతర ఉద్యోగాలు - 995
పై ఉద్యోగాల్లో గురుకులాలోని పోస్టులను సంబంధిత రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. ఇక పలు పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేస్తుంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా మరో 14 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తాజా అనుమతితో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 45,325 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఉద్యోగాల భర్తీ అంశాన్ని ట్విటర్ ద్వారా ఆర్థికమంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.
సంబంధిత కథనం