BHEL jobs: బీహెచ్ఈఎల్‌లో 575 అప్రెంటిస్ పోస్టులు.. అర్హతలివే!-bhel recruitment 2022 recruitment for 575 apprentice posts in bharat heavy electronics limited see details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bhel Jobs: బీహెచ్ఈఎల్‌లో 575 అప్రెంటిస్ పోస్టులు.. అర్హతలివే!

BHEL jobs: బీహెచ్ఈఎల్‌లో 575 అప్రెంటిస్ పోస్టులు.. అర్హతలివే!

HT Telugu Desk HT Telugu
Aug 29, 2022 02:40 PM IST

BHEL Recruitment 2022: భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BHEL) అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 575 ఖాళీలకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ట్రేడ్ అప్రెంటిస్‌లలో ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్‌ల ఖాళీలు ఉన్నాయి.

BHEL Recruitment 2022
BHEL Recruitment 2022

భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BHEL) అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. BHEL ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా, మూడు రకాల అప్రెంటీస్ పోస్ట్‌లలో (గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్) 10th, 12th, సంబంధిత ట్రేడ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ, ITI పాసైనా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. BHEL ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. దరఖాస్తుకు చివరి తేదీ 7 సెప్టెంబర్ 2022. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నాటికి అభ్యర్థులు అవసరమైన విద్యా / సాంకేతిక అర్హతను కలిగి ఉండాలని గుర్తుంచుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్‌లో, అర్హత షరతులను నెరవేర్చిన అభ్యర్థులకు BHELలో ఉద్యోగం పొందడానికి సువర్ణావకాశం ఉంటుంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు BHEL వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ రిక్రూట్‌మెంట్ సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను చూడవచ్చు. ఆ తర్వాత మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. BHEL రిక్రూట్‌మెంట్ 2022 ఆన్‌లైన్ దరఖాస్తు, వయోపరిమితి, దరఖాస్తు అర్హత, ఇతర సమాచారం కోసం, మీరు BHEL అధికారిక వెబ్‌సైట్ http://trichy.bhel.com/ని సందర్శించవచ్చు. అప్లికేషన్ సంబంధించిన వివరాలను కింద చూడవచ్చు.

BHEL రిక్రూట్‌మెంట్ ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ - 24 ఆగస్టు 2022

దరఖాస్తు చివరి తేదీ - 07 సెప్టెంబర్ 2022

వయోపరిమితి

-18 నుండి 27 సంవత్సరాలు

ఖాళీ వివరాలు

పోస్ట్ వివరాలు - గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ & ట్రేడ్ అప్రెంటిస్.

పోస్టుల సంఖ్య - 575

జీతం -ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7700 నుండి రూ.9000 వరకు స్టైపెండ్‌గా ఇవ్వబడుతుంది.

సర్వీస్ వ్యవధి: ఎంపికైన అభ్యర్థులు BHEL త్రిచురాపల్లిలో 12 నెలల అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌ చేయాల్సి ఉంటుంది.

అభ్యర్థులు BHEL త్రిస్సూరాపల్లి వెబ్‌సైట్ http://www.mhrdnats.gov.in/ సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్