Navy Recruitment:నేవీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌కు రికార్డు దరఖాస్తులు.. ఎన్నంటే!
Navy Agniveer Recruitment 2022: ఇండియన్ నేవీలో MR, SR అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్ కోసం రికార్డ్ స్థాయిలో అప్లికేషన్లు వచ్చాయి. 9.55 లక్షల మంది యువత ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.
అగ్నిపథ్ స్కీమ్ కింద ఇండియన్ నేవీలోని MR, SR పోస్టులకు రికార్డ్ స్థాయిలో అప్లికేషన్లు వచ్చాయి. నేవీ MR, SR అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం 9.55 లక్షల మంది యువత దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 82000 మంది మహిళలు. ఈ మేరకు భారత నావికాదళం ట్వీట్ చేసింది.ఇండియన్ నేవీలో అగ్నిపథ్ పథకం కింద, నేవీ SR అగ్నివీర్‌లో 2800 ఖాళీలు ఉండగా.. MRలో 200 ఖాళీలు ఉన్నాయి. బుధవారంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది. నేవీ తెలిపిన వివరాల ప్రకారం, నేవీ MR, SSR అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం 82200 మంది మహిళలతో సహా మొత్తం 955403 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు నేవీ అగ్నివీర్ ఎంఆర్ దరఖాస్తుకు అర్హులు కాగా, సైన్స్ స్ట్రీమ్‌లో 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎస్‌ఎస్‌ఆర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ భాగంగా ముందుగా అభ్యర్థులకు వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. విజయవంతమైన అభ్యర్థులను PFT అంటే ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ కోసం పిలుస్తారు. వ్రాత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా PFT అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది.
పురుషులు 6.30 నిమిషాల్లో 1.6 కి.మీ.20 స్క్వాట్‌లు, 12 పుషప్‌లు కొట్టాలి.
మహిళలు 8 నిమిషాల్లో 1.6 కి.మీ.15 సిట్-అప్‌లు, 10 బెంట్ మోకాలి సిట్ అప్‌లు చేయాల్సి ఉంటుంది.
నేవీలో అగ్నివీర్స్ రిక్రూట్‌మెంట్‌లో మొదటి బ్యాచ్‌లో 20 శాతం మంది అభ్యర్థులు మహిళలు అవకాశం ఉంటుంది
అగ్నిపథ్ పథకం కింద, భారత సైన్యం, నేవీ, వైమానిక దళంలో 4 సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది ఇక.వైమానిక దళానికి చెందిన అగ్నివీరులకు అగ్నివీర్వాయుగా పిలుస్తారు. 4 సంవత్సరాల తరువాత, 75 శాతం మంది సైనికులను రిలివ్ ఇస్తారు. మిగిలిన 25 శాతం మంది అగ్నివీరులను శాశ్వత జవాన్లుగా నియమిస్తారు.
సంబంధిత కథనం