Twitter edit: ట్విటర్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి ట్వీట్ ఎడిట్ ఆప్షన్!-twitters first ever edited tweet is here all you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Twitter Edit: ట్విటర్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి ట్వీట్ ఎడిట్ ఆప్షన్!

Twitter edit: ట్విటర్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి ట్వీట్ ఎడిట్ ఆప్షన్!

HT Telugu Desk HT Telugu
Updated Sep 30, 2022 02:53 PM IST

ట్విటర్ తన వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. చాలా కాలంగా ఎడిట్ ఆప్షన్ సంబందించిన డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో తొలిసారిగా ఎడిట్ చేసిన ట్విట్ విడుదల చేసింది.

<p>Twitter</p>
Twitter

ట్విట్టర్‌లో ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వాలని వినియోగదారులు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా త్వరలో ఎడిట్ ఆప్షన్‌ను అందజేస్తామని ప్రకటించిన ట్విట్టర్ ఇప్పుడు ఆ డిమాండ్ మేరకు తొలి ఎడిట్ చేసిన ట్వీట్‌ను విడుదల చేసింది. ఈ ఆప్షన్‌ను బ్లూ హ్యాండిల్ Twitter ఖాతలపై సెప్టెంబర్ 30న పరీక్షించారు. "ఎడిట్ బటన్ పని తీరును నిర్ధారించుకోవడానికి పరీక్షించాము, ఇది ఎలా పని చేస్తుందో మేము మీకు వివరంగా తెలియజేస్తాము" అని ట్విటర్ ప్రకటించింది. ఎడిట్ బటన్ సదుపాయం ముందుగా 'ట్విట్టర్ బ్లూ' కేటగిరీ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ నెల ప్రారంభంలో, ట్విట్టర్ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 'ట్విట్టర్ బ్లూ' వినియోగదారులతో ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించింది. సవరించిన ట్వీట్ ఎలా ఉంటుందో చూపించింది.

మొదటి ఎడిట్ చేసిన ట్వీట్ క్రింద పెన్సిల్ లాంటి చిహ్నం కనిపిస్తుంది, ఇది ట్వీట్ చివరిగా ఎడిట్ చేయబడిన టైమ్ స్టాంప్‌ను సూచిస్తుంది. మీరు 'లాస్ట్ ఎడిట్' లేబుల్‌పై క్లిక్ చేసినప్పుడు, అక్కడ మీరు ఆ ట్వీట్ హిస్టరీని చూడవచ్చు. దీనిలో మీరు అసలు ట్వీట్‌ను, కాలక్రమేణా దానికి చేసిన మార్పులను చూడవచ్చు. ఇప్పుడు ఈ సరికొత్త ఫీచర్ కోసం వినియోగదారులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ట్విటర్‌లో ఎడిట్ ఆప్షన్‌ను పొందాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది, అందుకు అణుగుణంగా ట్విట్టర్ చేస్తున్న ప్రయత్నాలు మరోసారి చర్చకు దారితీసింది. కొంతమంది వినియోగదారులు ఈ ఫీచర్‌ను స్వాగతించగా, మరికొందరు ఇది 'ట్విట్టర్ బ్లూ'కి మాత్రమే పరిమితం చేయబడుతుందని భావిస్తున్నారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ఎడిట్ బటన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 'ట్విట్టర్ బ్లూ' US, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో నెలకు $4.99 రుసుము చెల్లించవవారికి ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంచింది.

'ట్విట్టర్ బ్లూ' వినియోగదారులు తమ ప్రస్తుత ట్వీట్లలో ఏవైనా మార్పులు చేయడానికి కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది, ఈ మార్పులను పరిమిత కాల వ్యవధిలో ఎన్నిసార్లు అయినా చేయవచ్చు. అరగంట సమయం ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమిటంటే, వినియోగదారులు అదే ట్వీట్‌ను పునరావృతం చేయకుండా మరియు దాని అర్థాన్ని మార్చకుండా నిరోధించడమే దీని లక్ష్యం. ఇదిలా ఉంటే, పరిమిత దేశాలలో ఉండే 'ట్విట్టర్ బ్లూ' వినియోగదారులు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఇండియన్ యూజర్స్‌కు ఎప్పుడు ఆప్షన్ అందుబాటులో ఉంటుదనే దానిపై ఎటువంటి సమాచారం లేదు.

Whats_app_banner

సంబంధిత కథనం