శరీరం సరైన బరువు ఉండడం ఓవరాల్ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) వ్యక్తి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఉండాల్సిన దాని కన్నా ఎక్కువ లేకపోతే తక్కువ బరువు ఉండకూడదు.
Photo: Pexels
ఎప్పుడూ ఆరోగ్యకరమైన బరువును మెయింటెన్ చేయాలి. దీని కోసం పాటించాల్సిన ఐదు ముఖ్యమైన టిప్స్ ఏవో చూడండి.
Photo: Pexels
ఆరోగ్యకరమైన బరువుతో ఉండేందుకు వ్యాయామం చాలా ముఖ్యం. కండరాలు, ఎముకలను ఇది బలంగా చేయగలదు. బరువు నియంత్రిస్తుంది. అందుకే ప్రతీ రోజు తగిన వ్యాయామాలు చేయాలి.
Photo: Pexels
సరైన బరువు ఉండేందుకు ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్ పాటించాలి. పోషకాలు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, నట్స్, విత్తనాలు, గుడ్లు మీ ఆహారంలో తీసుకోవాలి.
Photo: Pexels
బరువు సరైన రీతిలో ఉండేందుకు సరిపడా నిద్ర కూడా అవసరం. జీవక్రియ మెరుగ్గా ఉండాలంటే తగినంత నిద్రించాలి.
Photo: Pexels
శరీరంలోని వ్యర్థాలు సమర్థవంతంగా బయటికి పోయేందుకు ప్రతీ రోజు తగినంత నీరు తాగాలి. దీని వల్ల శరీర బరువు తగినంత విధంగా ఉంటుంది.
Photo: Pexels
బరువు సక్రమంగా ఉండాలంటే ఫ్రై చేసిన ఫుడ్స్, బర్గర్లు, పిజ్జాలు లాంటి జంక్ ఫుడ్ తినకూడదు. ఇవి ఎక్కువ తింటే ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి.
Photo: Pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి