JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షల రెస్పాన్స్ షీట్స్ ను మద్రాస్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శుక్రవారం విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ 2024 అధికారిక వెబ్సైట్ jeeadv.ac.in లో తమ రెస్పాన్స్ షీట్లను చెక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
జేఈఈ అడ్వాన్స్డ్ 2024 (JEE Advanced 2024) పరీక్ష రాస్తున్న సమయంలో విద్యార్థి గుర్తించిన సమాధానాల కాపీని రెస్పాన్స్ షీట్ అంటారు. రెస్పాన్స్ షీట్ల సాయంతో విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ డ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. ఈ షీట్ పేపర్ 1, పేపర్ 2 రెండింటికీ అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులకు ప్రొవిజనల్ ఆన్సర్ కీని జూన్ 2వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ప్రొవిజనల్ ఆన్సర్ కీలపై జూన్ 2, జూన్ 3 తేదీల్లో విద్యార్థులు తమ అభ్యంతరాలను, ఫీడ్ బ్యాక్ ను వెల్లడించవచ్చు. ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీని 2024 జూన్ 9న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
విద్యార్థులు తమ రెస్పాన్స్ షీట్స్ ను జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced 2024) అధికారిక వెబ్ సైట్ jeeadva.ac.in.లో ఈ కింది స్టెప్స్ ఫాలో అవుతూ చెక్ చేసుకోవచ్చు. రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వంటి ఆధారాలను ఉపయోగించి అధికారిక వెబ్సైట్లో లాగిన్ కావాలి.
జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced 2024) కు సంబంధించి ఈ ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోండి.
జేఈఈ అడ్వాన్స్ డ్ 2024 (JEE Advanced 2024) పరీక్ష మే 26న జరిగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించారు. గతేడాది జేఈఈ అడ్వాన్స్డ్ 2023 ఫలితాలను జూన్ 18న విడుదల చేసిన సంగతి తెలిసిందే.