JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షల ఆన్సర్ కీ, ఫలితాలను మద్రాస్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ త్వరలో విడుదల చేయనుంది. మే 26 తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత అభ్యర్థులు తమ ఫలితాలను జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్ సైట్లో అంటే jeeadv.ac.in చూసుకోవచ్చు. గతేడాది జేఈఈ అడ్వాన్స్డ్ 2023 ఫలితాలను 2023, జూన్ 18న విడుదల చేసిన సంగతి తెలిసిందే.
జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced 2024) అధికారిక వెబ్సైట్ jeeadv.ac.in ప్రకారం, ఈ సంవత్సరం తుది ఆన్సర్ కీని, అలాగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను జూన్ 9 వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రకటించనున్నారు. ఈ ఫలితాలను జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced 2024) అధికారిక వెబ్ సైట్ లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. తమ ఫలితాలను చూసుకునేందుకు విద్యార్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు రాసిన విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు ఇవే..
జేఈఈ అడ్వాన్స్డ్ 2023 లో హైదరాబాద్ కు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి టాపర్ గా నిలిచారు. పరీక్షలో 360 మార్కులకు గాను 341 మార్కులు సాధించాడు. జేఈఈ అడ్వాన్స్డ్ 2023 పరీక్షల్లో జనరల్ కేటగిరీకి చెందిన 13828 మంది, ఓబీసీ-ఎన్సీఎల్ కేటగిరీ (9029 మంది), జనరల్-ఈడబ్ల్యూఎస్ కేటగిరీ (5363 మంది), ఎస్సీ కేటగిరీ (10993 మంది), ఎస్టీ కేటగిరీ (4081 మంది విద్యార్థులు) ఉత్తీర్ణత సాధించారు.