JEE Advanced 2023: ఐఐటీ జేఈఈ కోసం FAQలను విడుదల చేసిన ఐఐటీ గువాహటి
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) కోసం తరచుగా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ (FAQs) ను ఐఐటీ గువాహతి (IIT Guwahati) విడుదల చేసింది.
JEE Advanced 2023: వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు
జేఈఈ అడ్వాన్స్డ్ 2023 (JEE Advanced 2023) రాసే విద్యార్థులకు తరచూ వచ్చే సందేహాలు, అనుమానాలను, వాటికి సమాధానాలను క్రోడీకరించి తరచుగా అడిగే ప్రశ్నలుగా IIT Guwahati రూపొందించింది. వాటిని అఫీషియల్ వెబ్ సైట్లో పొందుపర్చింది. ఈ jeeadv.ac.in వెబ్సైట్లో ఆ ఎఫ్ఏక్యూ(FAQ)లను విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. అయితే, ఈ ఎఫ్ఏక్యూలు(FAQs) ఈ సంవత్సరం జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ (JEE advanced 2023) కు మాత్రమే వర్తిస్తాయని ఐఐటీ గువాహటి (IIT Guwahati) స్పష్టం చేసింది.
JEE Advanced 2023: పరీక్ష ఎప్పుడు?
జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) ను ఈ సంవత్సరం జూన్ 4వ తేదీన రెండు షిఫ్ట్ ల్లో నిర్వహించనున్నారు. పేపర్ 1 ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ఉంటుంది. ఈ పరీక్ష (JEE Advanced) కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 30న ప్రారంభమవుతుంది. పూర్తి వివరాల కోసం jeeadv.ac.in వెబ్ సైట్ ను తరచుగా చెక్ చేస్తూ ఉండండి.
JEE Advanced 2023: FAQsను చెక్ చేసుకోవడం ఎలా?
- ముందుగా జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced 2023) అఫీషియల్ వెబ్ సైట్ jeeadv.ac.in ను సందర్శించాలి.
- హోం పేజీపై కనిపించే JEE Advanced 2023 FAQs పై క్లిక్ చేయాలి.
- ప్రశ్నలు, జవాబులతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే, డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.