JEE Eligibility Criteria Relaxed: జేఈఈ అర్హత ప్రమాణాల్లో సడలింపు: వివరాలివే-jee eligibility criteria relaxed know complete details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Jee Eligibility Criteria Relaxed Know Complete Details Here

JEE Eligibility Criteria Relaxed: జేఈఈ అర్హత ప్రమాణాల్లో సడలింపు: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 11, 2023 11:34 AM IST

JEE Eligibility Criteria Relaxed: జేఈఈ అర్హత ప్రమాణాలను ఎన్‍టీఏ సడలించింది. ఐఐటీలు, ఎన్ఐటీల్లో అడ్మిషన్ల కోసం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. పూర్తి వివరాలివే..

JEE Eligibility Criteria Relaxed: జేఈఈ అర్హత ప్రమాణాల్లో సడలింపు: వివరాలివే
JEE Eligibility Criteria Relaxed: జేఈఈ అర్హత ప్రమాణాల్లో సడలింపు: వివరాలివే

JEE Eligibility Criteria Relaxed: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అర్హత ప్రమాణాలను (Eligibility Criteria)లను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సడలించింది. ఐఐటీలు, ఎన్ఐటీలు సహా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్‍స్టిట్యూట్‍ (CFTIs)లలో ప్రవేశాల కోసం జేఈఈ పరీక్షలను ప్రతీ సంవత్సరం ఎన్‍టీఏ నిర్వహిస్తోంటోంది. ఐఐటీలు (IITs), ఎన్ఐ‍టీలు (NITs), సీఎఫ్‍టీఐల్లో అడ్మిషన్ సాధించాలంటే జేఈఈ మెయిన్ ర్యాంక్‍తో పాటు అభ్యర్థులకు 12వ తరగతి/ఇంటర్‌లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. అయితే దీనికి కొత్త అర్హత ప్రమాణాన్ని ఎన్‍టీఏ ప్రకటించింది. సంబంధిత బోర్డు పరీక్షల్లో టాప్ 20 శాతంలో (Top 20 Percentile) ఉన్న అభ్యర్థులు కూడా అర్హులేనని ప్రకటించింది. అంటే జేఈఈ మెయిన్‍లో ర్యాంకును సాధించి.. 12వ తరగతి/ఇంటర్‌లో 75 శాతం మార్కులు లేదా సంబంధిత బోర్డు పరీక్షలో టాప్ 20 శాతంలో నిలిచిన వారు కూడా ఐఐటీ, ఎన్ఐటీల్లో అడ్మిషన్ పొందొచ్చు.

JEE Eligibility Criteria Relaxed: 12వ తరగతి పరీక్షల్లో 75 శాతం మార్కులు తప్పనిసరి నిబంధనను సడలించాలని ఎన్‍టీఏకు చాలా కాలం నుంచి అభ్యర్థనలు వస్తూనే ఉన్నాయి. దీంతో తాజా నిర్ణయం తీసుకుంది. అయితే 75 శాతం మార్కుల నిబంధనను ఎన్‍టీఏ తగ్గించలేదు. దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో అర్హత ప్రమాణాన్ని తీసుకొచ్చింది. సంబంధిత బోర్డు పరీక్షల్లో టాప్ 20 శాతంలో ఉన్న విద్యార్థులు అడ్మిషన్ పొందచ్చన్న నిబంధన తీసుకొచ్చింది. “జేఈఈ ర్యాంకుల ఆధారంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర సీఎఫ్‍టీఐల్లో ప్రవేశానికి అర్హత పొందిన అభ్యర్థులు.. 12వ తరగతి పరీక్షలో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి లేదా సంబంధిత బోర్డు నిర్వహించిన 12వ తరగతి పరీక్షలో టాప్ 20 శాతంలో ఉండాలి” అని ఎన్‍టీఏ ప్రకటించింది. కాగా, ఎస్‍సీ, ఎస్టీ అభ్యర్థులకు 12వ తరగతి పరీక్షల్లో 65 శాతం మార్కులు ఉండాలి.

JEE (Main) Registration Dates: మరోవైపు, ఈ ఏడాది తొలి సెషన్ జేఈఈ మెయిన్ ఆన్‍‍లైన్ రిజిస్ట్రేషన్ రేపు (జనవరి 12) ముగియనుంది. Jeemain.nta.nic.in వెబ్‍సైట్‍లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 24 నుంచి 31 మధ్య జేఈఈ (మెయిన్) పరీక్షలు జరుగుతాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం