JEE Advanced 2023: జేఈఈ అడ్వాన్స్డ్ ఆన్సర్ కీ ని ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..-jee advanced 2023 answer key releasing tomorrow at jeeadvacin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Advanced 2023: జేఈఈ అడ్వాన్స్డ్ ఆన్సర్ కీ ని ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

JEE Advanced 2023: జేఈఈ అడ్వాన్స్డ్ ఆన్సర్ కీ ని ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu
Jun 10, 2023 02:48 PM IST

జేఈఈ అడ్వాన్స్డ్ 2023 ఆన్సర్ కీ పై కీలక అప్ డేట్ వెలువడింది. ఐఐటీ గువాహతి ఆదివారం, జూన్ 11న జేఈఈ అడ్వాన్స్డ్ 2023 ఆన్సర్ కీ ని విడుదల చేయనుంది. విద్యార్థులు jeeadv.ac.in వెబ్ సైట్ నుంచి ఆ ఆన్సర్ కీ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

జేఈఈ అడ్వాన్స్డ్ 2023 (JEE Advanced 2023) ఆన్సర్ కీ (JEE Advanced 2023 answer key) పై కీలక అప్ డేట్ వెలువడింది. ఐఐటీ గువాహతి ఆదివారం, జూన్ 11న జేఈఈ అడ్వాన్స్డ్ 2023 ఆన్సర్ కీ ని విడుదల చేయనుంది. విద్యార్థులు jeeadv.ac.in లేదా jeemain.nta.nic.in. వెబ్ సైట్స్ నుంచి ఆ ఆన్సర్ కీ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జూన్ 9వ తేదీన ఐఐటీ గువాహతి జేఈఈ అడ్వాన్స్డ్ రెస్పాన్స్ షీట్స్ ను విడుదల చేసింది. ఐఐటీ జేఈఈ పరీక్ష జూన్ 4వ తేదీన రెండు షిఫ్ట్ ల్లో జరిగింది.

రేపే ఆన్సర్ కీ విడుదల

ఐఐటీ గువాహతి (IIT Guwahati) ఆదివారం, జూన్ 11న జేఈఈ అడ్వాన్స్డ్ 2023 ఆన్సర్ కీ ని విడుదల చేయనుంది. ఈ ఆన్సర్ కీని జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసిన విద్యార్థులు ఐఐటీ జేఈఈ అధికారిక వెబ్ సైట్స్ jeeadv.ac.in లేదా jeemain.nta.nic.in. నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్స్ లో జూన్ 11, జూన్ 12 తేదీల్లో చాలెంజ్ విండో (challenge window) ఓపెన్ అవుతుంది. అందులో విద్యార్థులు ఆన్సర్ కీపై తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ఆ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, ఆన్సర్ కీ లో అవసరమైన మార్పులు చేసి, ఫైనల్ ఆన్సర్ కీ (final answer key) ని జూన్ 18న విడుదల చేస్తారు.

డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా?

  • ముందుగా అధికారిక వెబ్ సైట్ jeeadv.ac.in లేదా jeemain.nta.nic.in.ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీపై కనిపించే JEE Advanced 2023 answer key ఆన్సర్ కీ లింక్ పై క్లిక్ చేయాలి.
  • లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్మిట్ బటన్ నొక్కాలి.
  • స్క్రీన్ పై ఆన్సర్ కీ కనిపిస్తుంది.
  • ఆ ఆన్సర్ కీ ని పరిశీలించి, డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం దాన్ని ప్రింట్ తీసి పెట్టుకోవాలి.

Whats_app_banner