TG TET 2024 Results Update: జూన్‌ 12లోగా తెలంగాణ టెట్‌ 2024 ఫలితాల విడుదల, జూన్‌2 వరకు పరీక్షలు-release of telangana tet 2024 results by june 12 exams till june 2 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Tet 2024 Results Update: జూన్‌ 12లోగా తెలంగాణ టెట్‌ 2024 ఫలితాల విడుదల, జూన్‌2 వరకు పరీక్షలు

TG TET 2024 Results Update: జూన్‌ 12లోగా తెలంగాణ టెట్‌ 2024 ఫలితాల విడుదల, జూన్‌2 వరకు పరీక్షలు

Sarath chandra.B HT Telugu
May 28, 2024 07:20 AM IST

TG TET 2024 Results Update: తెలంగాణ విద్యాశాఖ నిర్వహించిన స్టేట్ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ జూన్‌2తో ముగియనున్నాయి. పరీక్షలు పూర్తైన వారం, పదిరోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారు. కంప్యూటర్ బేస్డ్‌ పరీక్షల ద్వారా తెలంగాణ టెట్‌ పరీక్షల్ని నిర్వహిస్తున్నారు.

జూన్‌ 12న తెలంగాణ టెట్ ఫలితాలు
జూన్‌ 12న తెలంగాణ టెట్ ఫలితాలు

TG TET 2024 Results Update: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ ఫలితాలను పరీక్షలు పూర్తైన వారం పది రోజుల్లో విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షలు ముగిసిన పదిరోజుల్లోగా ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2024 న ఫలితాలను జూన్ 12న విడుదల చేయనున్నారు. టెట్‌ పరీక్షకు మొత్తం 2,86,386మంది దరఖాస్తు చేశారు. వీరిలో పేపర్ 1 పరీక్షకు 99,958మంది, పేపర్ 2 పరీక్షకు 1,86,428మంది అప్లై చేసుకున్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ నియామకాలను చేపట్టేందుకు నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు టెట్ మార్కులకు వెయిటేజీ కల్పించారు. డిఎస్సీ నియామకాల్లో 80శాతం వ్రాత పరీక్ష మార్కులకు 20శాతం టెట్ మార్కులకు కేటాయించారు.

తెలంగాణ టెట్ పరీక్షలు మే 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇక మే 15వ తేదీ నుంచి వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.తెలంగాణ టెట్ పరీక్షలు జూన్ 2వ తేదీతో పూర్తి అవుతాయి. 25,26,27 తేదీల్లో ఎలాంటి పరీక్షలు కూడా లేవు. మిగతా అన్ని తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. జూన్ 12వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.

ఇక తెలంగాణ టెట్ హాల్ టికెట్లు మే 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. అంటే పరీక్షలు ప్రారంభమయ్యే ఐదు రోజుల ముందు నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకునే వీలు ఉంటుంది. https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు

టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

హోంపేజీలో కనిపించే 'డౌన్లోడ్ Hall Tickets 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

ఇక్కడ రిజిస్ట్రేషన్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.

సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి. భవిష్యత్ అవసరాల రీత్యా భద్రంగా ఉంచుకోవటం మంచిది.

TS TET Schedule : తెలంగాణ టెట్ పరీక్ష షెడ్యూల్ - 2024

మే 20, 2024 – పేప‌ర్ 2 - మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S1)

మే 20, 2024 – పేప‌ర్ 2 - మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S)

మే 21, 2024 – పేప‌ర్ 2 -మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S1)

మే 21, 2024 – పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S2)

మే 22, 2024 – పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S1)

మే 22, 2024 – పేప‌ర్ 2 -మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S2)

మే 24, 2024 – పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్(మైన‌ర్ మీడియం)(సెష‌న్ – S1)

మే 24, 2024 – పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S2)

మే 28 , 2024– పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S1)

మే 28, 2024 – పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S2)

మే 29, 2024 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S1)

మే 29, 2024 – పేప‌ర్ 2- సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S2)

మే 30 , 2024– పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)

మే 30, 2024 – పేప‌ర్ 1- (సెష‌న్ – S2)

మే 31, 2024 – పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)

మే 31, 2024 – పేప‌ర్ 1 -(సెష‌న్ – S2)

జూన్ 1 , 2024– పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైన‌ర్ మీడియం)(సెష‌న్ – S1)

జూన్ 1, 2024 – పేప‌ర్ 1-(మైన‌ర్ మీడియం) (సెష‌న్ – S2)

జూన్ 2 , 2024– పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)

జూన్ 2 , 2024– పేప‌ర్ 1- (సెష‌న్ – S2).

Whats_app_banner

సంబంధిత కథనం