JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్‌కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..
JEE Advanced 2024 registration : జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. మే 7తో ముగియనుంది. మరి మీరు అప్లై చేసుకున్నారా? ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
JEE Advanced 2024 registration last date : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్.. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ అడ్వాన్స్డ్ 2024) కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను త్వరలో ముగించనుంది. అర్హులైన అభ్యర్థులు.. ఐఐటీ ప్రవేశ పరీక్షకు అధికారిక వెబ్సైట్ అయిన jeeadv.ac.in. లో దరఖాస్తు చేసుకోవచ్చు.
జేఈఈ అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ మే 7 రాత్రి 11:30 గంటలు అని గుర్తు పెట్టుకోవాలి. అంటే ఇంకా రెండు రోజుల్లో గడువు పూర్తవుతుంది.
జేఈఈ మెయిన్స్ బీఈ/బీటెక్ పేపర్స్‌లో టాప్ 2,50,000 మంది (అన్ని కేటగిరీలతో కలిపి) అభ్యర్థులు.. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హులు.
JEE Advanced 2024 exam date : అభ్యర్థులు అక్టోబర్ 1, 1999 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. అంటే.. వారు అక్టోబర్ 1, 1994 తర్వాత జన్మించి ఉండాలి.
ఇదీ చూడండి:- CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్ఈ ఫలితాలు- డిజీలాకర్ యాక్సెస్ కోడ్స్ విడుదల..
జేఈఈ అడ్వాన్స్డ్ ఫీజు చెల్లింపు విండో మే 10, 2024తో ముగియనుంది.
జేఈఈ అడ్వాన్స్డ్ 2024 కోసం రిజిస్టర్ చేసుకోవడానికి లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జేఈఈ అడ్వాన్స్డ్ 2024 కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి..
స్టెప్ 1:- jeeadv.ac.in వద్ద జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
JEE Advanced 2024 syllabus : స్టెప్ 2:- హోమ్ పేజీలో ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్‌ను ఓపెన్ చేయండి.
స్టెప్ 3:- జేఈఈ మెయిన్ క్వాలిఫైడ్ అభ్యర్థులు లేదా విదేశీ అభ్యర్థుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోండి.
స్టెప్ 4:- అవసరమైన వివరాలు అందించి లాగిన్ అవ్వాలి.
స్టెప్ 5:- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ నింపాలి.
స్టెప్ 6:- డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయండి. పేమెంట్ చేయండి.
JEE Advanced 2024 registration fees : స్టెప్ 7:- మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి.
స్టెప్ 8:- తదుపరి అవసరాల కోసం ఆ అప్లికేషన్ ఫామ్ కాపీని డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి.
జేఈఈ అడ్వాన్స్డ్ 2024 దరఖాస్తు ఫీజు:- మహిళా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు మినహా.. భారతీయ అభ్యర్థులందరికీ రూ.3,200. ఈ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1,600.
ప్రముఖ ఐఐటీల్లో ఇంజినీరింగ్ చేసేందుకు నిర్వహించే పరీక్షే ఈ జేఈఈ అడ్వాన్స్డ్. ఇందులో ఉత్తీర్ణులై, ఐఐటీల్లో చేరాలని లక్షలాది మంది అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తుంటారు.
సంబంధిత కథనం