JEE Advanced 2024 : నేడు జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..
JEE advanced 2024 registration : జేఈఈ అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ఏప్రిల్ 27, 2024న ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
JEE advanced 2024 registration date : జేఈఈ అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియను.. శనివారం, ఏప్రిల్ 27, 2024న ప్రారంభించనుంది ఐఐటీ మద్రాస్. ఐఐటీ జేఈఈకి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు jeeadv.ac.in జేఈఈ అడ్వాన్స్ డ్ అధికారిక వెబ్సైట్లో డైరెక్ట్ లింక్‌ను చూడవచ్చు. సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివేట్ అవుతుందని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి.
ఐఐటీ జేఈఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి.. జేఈఈ (మెయిన్) 2024 బీఈ/బీటెక్ పేపర్లో టాప్ 2,50,000 మంది (అన్ని కేటగిరీలతో సహా) అభ్యర్థుల్లో ఒకరుగా ఉండాలి. అభ్యర్థులు అక్టోబర్ 1, 1999 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. అంటే ఈ అభ్యర్థులు 1994 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి.
జేఈఈ అడ్వాన్స్ డ్ 2024: ఇలా రిజిస్టర్ చేసుకోడి..
JEE advanced 2024 application last date : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. ఈ కింద చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
- స్టెప్ 1:- jeeadv.ac.in జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
- స్టెప్ 2:- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న జేఈఈ అడ్వాన్స్డ్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
- స్టెప్ 3:- అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్టర్ చేసుకునేందుకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
ఇదీ చూడండి:- Two CBSE board exams: 2025 నుంచి రెండు సార్లు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు!; విధివిధానాలపై కసరత్తు
- స్టెప్ 4:- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
- స్టెప్ 5:- అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- స్టెప్ 6:- సబ్మిట్పై క్లిక్ చేసి పేజీని డౌన్లోడ్ చేసుకోండి.
- స్టెప్ 7:- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసి పెట్టుకోండి.
JEE advanced 2024 exam date : మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1600. భారతీయులైన ఇతర అభ్యర్థులకు రూ.3200. ఆన్లైన్లోనే ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 7 మే 2024. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మే 10, 2024. మరిన్ని వివరాలకు అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్ సైట్ ను చూడవచ్చు.
త్వరలో సీబీఎస్ఈ ఫలితాలు..!
CBSE results 2024 : సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల ఫలితాలు, సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాల కోసం విద్యార్థుల నిరీక్షణ కొనసాగుతోంది. ఫలితాల విడుదలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్జ్యుకేషన్ సీబీఎస్ఈ.. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. త్వరలోనే ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పాత ట్రెండ్స్‌ని పరిశీలిస్తే.. సీబీఎస్ఈ ఫలితాలు.. ఏప్రిల్- మేలో విడుదలవుతాయి. డేట్, టైమ్ వివరాలను సీబీఎస్ఈ ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం