JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ వాయిదా- పూర్తి వివరాలు..-jee advanced 2024 registration date postponed check full details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ వాయిదా- పూర్తి వివరాలు..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ వాయిదా- పూర్తి వివరాలు..

Sharath Chitturi HT Telugu
Apr 21, 2024 11:08 AM IST

JEE Advanced 2024 registration date : జేఈఈ అడ్వాన్స్​డ్ 2024​ అభ్యర్థులకు అలర్ట్​. జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ వాయిదా పడింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

జేఈఈ అడ్వాన్స్​డ్​ అభ్యర్థులకు అలర్ట్​..
జేఈఈ అడ్వాన్స్​డ్​ అభ్యర్థులకు అలర్ట్​..

JEE Advanced 2024 registration : జేఈఈ అడ్వాన్స్​డ్​ 2024 రిజిస్ట్రేషన్​ ప్రక్రియను వాయిదా వేసింది ఐఐటీ మద్రాస్. ఏప్రిల్ 21న ప్రారంభం కావాల్సిన ఐఐటీ జేఈఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా పడగా.. 2024 ఏప్రిల్ 27న ప్రారంభం కానుంది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు jeeadv.ac.in జేఈఈ అడ్వాన్స్​డ్​ అధికారిక వెబ్​సైట్​ని చూడవచ్చు.

జేఈఈ అడ్వాన్స్​ 2024 వివరాలు..

ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తులను పూర్తి చేసేందుకు చివరి తేదీ.. 7 మే 2024. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు.. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మే 10, 2024.

జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్ కార్డును మే 17న విడుదల చేస్తామని, మే 26, 2024 వరకు డౌన్​లోడ్​ చేసుకోవచ్చని తెలిపింది ఐఐటీ మద్రాస్​.

JEE Advanced 2024 apply online : జేఈఈ అడ్వాన్స్ డ్ 2024 పరీక్షను మే 26న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు.

ఐఐటీ జేఈఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి జేఈఈ (మెయిన్) 2024 బీఈ/బీటెక్ పేపర్లో టాప్ 2,50,000 మంది (అన్ని కేటగిరీలతో సహా) అభ్యర్థుల్లో ఒకరుగా ఉండాలి. అభ్యర్థులు అక్టోబర్ 1, 1999 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. అంటే ఈ అభ్యర్థులు 1994 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి.

ఇదీ చూడండి:- UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ సెషన్ కు రిజిస్ట్రేషన్స్ ప్రారంభం; లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

జేఈఈ అడ్వాన్స్ డ్ 2024: ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

JEE Advanced 2024 registration fee : ఐఐటీ జేఈఈ అడ్వాన్స్​డ్​ 2024కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన అభ్యర్థులందరూ ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.

  • స్టెప్​ 1:- jeeadv.ac.in జేఈఈ అడ్వాన్స్​డ్​ అధికారిక వెబ్​సైట్​ను సందర్శించండి.
  • స్టెప్​ 2:- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న జేఈఈ అడ్వాన్స్​డ్​ 2024 రిజిస్ట్రేషన్ లింక్​పై క్లిక్ చేయండి.
  • స్టెప్​ 3:- రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మీట్ బటన్​పై క్లిక్ చేయాలి.
  • JEE Advanced 2024 : స్టెప్​ 4:- ఇప్పుడు అకౌంట్​లోకి లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ నింపాలి.
  • స్టెప్​ 5:- అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్​పై క్లిక్ చేయాలి.
  • స్టెప్​ 6:- పేజీని డౌన్​లోడ్ చేయండి, తదుపరి ఉపయోగం కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.

How to apply for JEE Advanced 2024 registration : మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1600, ఇతర అభ్యర్థులు భారతీయులు రూ.3200. ఆన్​లైన్​ ఫీజు చెల్లించాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్​డ్ అధికారిక వెబ్​సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు.. ఎప్పటికప్పుడు సైట్​ని ఫాలో అవుతూ ఉండాలి.

సంబంధిత కథనం