Govt Jobs 2024 : ఐఐటీ తిరుపతిలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు - నేటితో ముగియనున్న దరఖాస్తులు , వెంటనే అప్లయ్ చేసుకోండి
IIT Tirupati Recruitment 2024 Updates: తిరుపతి ఐఐటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ఇవాళ్టి(ఏప్రిల్ 11)తో ముగియనున్నాయి. ఈ నోటిఫికేషన వివరాలను ఇక్కడ చూడండి….
IIT Tirupati Recruitment 2024 Updates: కొద్దిరోజులు కిందట తిరుపతి ఐఐటీ నుంచి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా… ఇవాళ్టితో(ఏప్రిల్ 11) గడువు పూర్తి కానుంది. ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 08 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హతల గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. https://iittp.ac.in/recruitment వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన - ఐఐటీ, తిరుపతి.
- మొత్తం ఉద్యోగాలు - 08
- ఖాళీల వివరాలు :
- జూనియర్ అసిస్టెంట్ - 03(Group C)
- స్టూడెంట్ కౌన్సెలర్ - 01(Group A)
- హిందీ ట్రాన్స్‌లేటర్ - 01(Group B)
- జూనియర్ నర్సింగ్ ఆఫీసర్ - 1 ఉద్యోగం(Group B)
- జూనియర్ టెక్నీషియన్ - 02 పోస్టులు(Group C)
- అర్హతలు - మాస్టర్ డిగ్రీ/ డిగ్రీ ఉండాలి. పోస్టులను బట్టి అర్హతలను నిర్ణయించారు. పని అనుభవం కూడా ఉండాలి. పూర్తి నోటిఫికేషన్ లో వివరాలను చూడొచ్చు.
- గ్రూప్ ఏ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వూ ఉంటుంది.గ్రూప్ బీ, సీ పోస్టుల భర్తీకి అబ్జెక్టివ్ బేస్ టెస్ట్, రాత పరీక్ష, స్కిల్ పరీక్ష ఉంటుంది.
- దరఖాస్తుల విధానం - ఆన్ లైన్
- దరఖాస్తులు ప్రారంభం - మార్చి 12, 2024
- దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - 11 ఏప్రిల్, 2024.
- అధికారిక వెబ్ సైట్ - https://iittp.ac.in/
- అప్లికేషన్ లింక్ - https://iittp.plumerp.co.in/prod/iittirupati/staffrecruitment
పోస్టుల భర్తీకి హైదరాబాద్ ECIL ప్రకటన
ECIL Hyderabad Recruitment 2024 : హైదరాబాద్‌లోని ఈసీఐఎల్(ECIL Hyderabad) నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవలే మూడుకుపైగా నోటిఫికేషన్లు ఇచ్చిన ఈసీఐఎల్…. మరో రిక్రూట్ మెంట్ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగా ఏడు ట్రైనీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా… ఏప్రిల్ 13వ తేదీతో పూర్తి కానుంది. 27 ఏళ్ల లోపు ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అవుతారని ప్రకటనలో స్పష్టం చేసింది. రాతపరీక్ష, ఇంటర్వూతో పాటు గ్రూప్ డిస్కషన్ వంటివి ఉంటాయి. https://www.ecil.co.in/jobs.html వెబ్ సైట్ లోకి వెళ్లి అర్హులైన అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన -ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హైదరాబాద్(ECIL, Hyderabad).
- ఉద్యోగాలు -ట్రైనీ ఆఫసర్ పోస్టులు.
- మొత్తం ఖాళీలు - 07.
- అర్హతలు - సీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- వయోపరిమితి - 27 ఏళ్ల లోపు ఉండాలి.
- జీతం - రూ. 40 వేల నుంచి రూ.1,40,000.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లోనే దరఖాస్తులను సమర్పించాలి.
- దరఖాస్తు ఫీజు - రూ. 1000 చెల్లించాలి.
- దరఖాస్తుల సమర్పణకు తుది గడువు - ఏప్రిల్ 13, 2024.
- ఎంపిక విధానం - రాత పరీక్ష, ఇంటర్వూ ఉంటుంది.
- బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్ కత్తా నగరాలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు.
- హాల్ టికెట్ల తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://www.ecil.co.in/home.html
- అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే jarait.j@ecil.co.in/ లేదా madhaviaurorab@ecil.co.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.