JEE Main: రేపటి నుంచే జేఈఈ మెయిన్స్; ఈ టిప్స్ తో ఒత్తిడిని జయించండి.. విజయం సాధించండి
JEE Main from tomorrow: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 రేపటి నుంచి, అంటే ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి. కీలకమైన ఈ పరీక్షకు విద్యార్థులు కొన్నేళ్లుగా ప్రిపేర్ అవుతున్నారు. చివరి నిమిషంలో తప్పులు చేయకుండా విద్యార్థులు ఈ జాగ్రత్తలు పాటించడం మంచిది.
JEE Main from tomorrow: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) సహా భారతదేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం పొందడానికి ప్రతి సంవత్సరం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) లక్షలాది మంది విద్యార్థులు రాస్తుంటారు. జేఈఈ మెయిన్ (JEE Main) , జేఈఈ అడ్వాన్స్ డ్ (JEE Advanced) అనే రెండు దశల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగింది. జేఈఈ మెయిన్ రెండో సెషన్ రేపటి నుంచి ఏప్రిల్ 12 వరకు జరగనుంది.
జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలకు హాజరువుతున్న విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించడం కోసం ఈ టిప్స్ ఫాలో కావాలి.
● విరామం: ప్రిపరేషన్ లో క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలి. దానివల్ల మానసికంగా కొంత రిలీఫ్ లభిస్తుంది. ఒత్తడి తగ్గుతుంది.
● ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోండి: ఆత్మవిశ్వాసం కోల్పోకండి. సాధించగలననే ఆత్మవిశ్వాసంతో ఉండండి. ప్రిపరేషన్ ను మాత్రమే నమ్మండి. సానుకూలంగా ఆలోచించండి. మీ తల్లిదండ్రులతో, మిత్రులతో కొంత సమయం గడపండి.
● పరీక్షా కేంద్రానికి సూచనలు: పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవడం, పరీక్షా కేంద్రాల్లో చేయాల్సినవి, చేయకూడనివి అర్థం చేసుకోవడం, మీ పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవడం వల్ల మీ సమయాన్ని తదనుగుణంగా నిర్వహించుకోవచ్చు.
జేఈఈ మెయిన్ 2024 చిట్కాలు
1. కనీసం 4 నుంచి 5 మాక్ టెస్టులు చేయాలి.
2. ఇంట్లోనే ఎగ్జామ్ హాల్ వాతావరణాన్ని సృష్టించుకుని టైమ్ బౌండ్ లో గత సంవత్సరాల పరీక్ష పత్రాలను సాల్వ్ చేయండి.
3. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చాప్టర్లలోని ముఖ్యమైన ఫార్ములాలు మీ ఫింగర్ టిప్స్ పై ఉండాలి. అప్పుడే ప్రశ్నలను సాల్వ్ చేసేటప్పుడు ఎడ్జ్ వస్తుంది.
4. జేఈఈ మెయిన్ పరీక్షకు ముందు చివరి వారంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించవద్దు లేదా కొత్త పుస్తకాన్ని చదవవద్దు.
5. రివిజన్ కోసం మీ చేతివ్రాత నోట్స్ ను రిఫర్ చేయండి.
6. ప్రతి గంట చదువు తర్వాత 5-10 నిమిషాల చిన్న విరామం తీసుకుంటే మనసు రిలాక్స్ అవుతుంది. ఇది అలసటను తగ్గిస్తుంది మరియు ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
7. 6 నుండి 7 గంటల నిద్రతో కూడిన స్థిరమైన దినచర్యను నిర్వహించండి.
8. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన, ఇంట్లో వండిన ఆహారాన్ని ఎంచుకోండి.
9. ప్రతిరోజూ కొంత సమయం మెడిటేషన్ కు కేటాయించడం మంచిది. ఇది ఏకాగ్రతను పెంచుతుంది.
ఎగ్జామ్ హాల్ లో ఇలా చేయండి
1. ముందుగా ప్రశ్నపత్రం మొత్తాన్ని జాగ్రత్తగా స్క్రోల్ చేయాలి.
2. తక్కువ రిస్క్, ఎక్కువ లాభం ఉన్న విభాగాలను ఎంచుకోండి.
3. ముందుగా సులభమైన ప్రశ్నలను ప్రయత్నించండి.
4. మీకు తెలియని ప్రశ్నతో ప్రారంభించవద్దు.
5. నెగెటివ్ మార్కులను నివారించడానికి ప్రశ్న గురించి మీకు అవగాహన లేకపోతే ఊహించవద్దు.
6. ఏదైనా విభాగం కఠినంగా ఉంటే కలత చెందవద్దు. వేరే విభాగాలలో స్కోర్ చేయవచ్చు.
7. ఒకే విభాగంపై ఎక్కువ సమయం కేటాయించవద్దు. పేపర్ ట్రై చేసేటప్పుడు టైమ్ చెక్ చేసుకోండి.
8. పరీక్షను రెండు సెషన్లలో రాయడానికి ప్రయత్నించండి.
ఒక రోజు ముందు టిప్స్
1. పాజిటివ్ గా ఆలోచించండి
2. మీ ప్రిపరేషన్ గురించి చర్చించవద్దు. ఎందుకంటే మీరు బాగా సిద్ధంగా ఉన్నప్పటికీ ఇది మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది.
3. జేఈఈ మెయిన్స్ కు ఒక రోజు ముందు కొత్తగా ఏమీ చదవొద్దు.
4. మిమ్మల్ని మీరు విశ్వసించండి, ప్రశాంతంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి.
5. అన్ని ముఖ్యమైన ఫార్ములాలను రివిజన్ చేయండి
6. సులభంగా ఛేదించగలరనే నమ్మకం మీలో పెట్టుకోండి
7. కనీసం 6-7 గంటలు గాఢంగా నిద్రపోండి.