JEE Advanced 2023 results : జేఈఈ అడ్వాన్స్​డ్​ ఫలితాలు విడుదల.. తెలుగు వారే టాపర్లు!-results of iit entrance exam jee advanced announced vavilala chidvila reddy bags top rank ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Advanced 2023 Results : జేఈఈ అడ్వాన్స్​డ్​ ఫలితాలు విడుదల.. తెలుగు వారే టాపర్లు!

JEE Advanced 2023 results : జేఈఈ అడ్వాన్స్​డ్​ ఫలితాలు విడుదల.. తెలుగు వారే టాపర్లు!

Sharath Chitturi HT Telugu
Jun 18, 2023 01:15 PM IST

JEE-Advanced 2023 results : జేఈఈ అడ్వాన్స్​డ్​ ఫలితాలు వెలువడ్డాయి. తెలుగు వారికి టాప్​ ర్యాంక్​లు వచ్చాయి.

జేఈఈ అడ్వాన్స్​డ్​ ఫలితాలు విడుదల.. తెలుగు వారే టాపర్లు!
జేఈఈ అడ్వాన్స్​డ్​ ఫలితాలు విడుదల.. తెలుగు వారే టాపర్లు! (Image credit : unsplash )

JEE Advanced 2023 results : జేఈఈ అడ్వాన్స్​డ్​ 2023 పరీక్ష ఫలితాలను ఆదివారం విడుదల చేసింది ఐఐటీ గువాహటి. ఐఐటీ హైదరాబాద్​ జోన్​కు చెందిన వావిలాల చిద్విలాస్​ రెడ్డికి మొదటి ర్యాంక్​ వచ్చింది. మొత్తం 360 మార్కులకు పరీక్ష జరగ్గా.. చిద్విలాస్​కు 341 మార్కులు దక్కాయి.

మహిళల్లో టాప్​ ర్యాంక్ కూడా హైదరాబాద్​ వాసికే దక్కడం విశేషం. ఐఐటీ హైదరాబాద్​ జోన్​కు చెందిన నాయకంటి నాగ భవ్య శ్రీకి టాప్​ ర్యాంక్​ వచ్చింది. మొత్తం మీద ఆమె 298 మార్కులతో 56వ ర్యాంక్​ సంపాదించుకుంది. 

"ఈసారి.. 1,80,372 మంది విద్యార్థులు.. జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్షలో రెండు పేపర్లు రాశారు. వారిలో 43,773 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో 36,204 మంది అబ్బాయిలు.. 7,509 మంది అమ్మాయిలు ఉన్నారు," అని ఐఐటీ గువాహటి వెల్లడించింది.

దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ పరీక్షను నిర్వహిస్తారు. ఎన్​ఐటీల కోసం కూడా ఈ ర్యాంక్​లను పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో రెండు విభాగాలు ఉన్నాయి. తొలుత జరిగే మెయిన్స్​ పరీక్షలో పాస్​ అయ్యే వారికి.. అడ్వాన్స్​డ్​ రాసే అర్హత లభిస్తుంది. రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించే వారికి.. ర్యాంక్​ల ఆధారంగా ఐఐటీల్లోకి ప్రవేశం లభిస్తుంది. ఈ నెల 4న 2023 జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్ష జరగ్గా.. తాజాగా ఫలితాలు వెలువడ్డాయి.

కామన్​ ర్యాంక్​ లిస్ట్​లోని టాప్​ 10 అభ్యర్థుల పేర్లు..

  • వావిలాల చిద్విలాస్​ రెడ్డి
  • రమేశ్​ సూర్య తేజ
  • రిషి కార్ల
  • రాఘవ్​ గోయల్​
  • అడ్డగాడ వెంకట శివరామ్​
  • ప్రభవ్​ ఖండేల్వాల్​
  • బిక్కిన అభినవ్​ చౌదరి
  • మలయ్​ కేడియా
  • నాగిరెడ్డి బాలాజీ రెడ్డి
  • యక్కండి ఫని వెంకట మానేందర్​ రెడ్డి.

టాప్​ 10లో ఆరుగురు హైదరాబాద్​ జోన్​కు చెందిన వారే ఉండటం విశేషం. మరో నలుగురు ఢిల్లీ, రూర్కీకి చెందిన వారున్నారు.

మీ ఫలితాలను ఇలా చెక్​ చేసుకోండి..

స్టెప్​ 1:- జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్ష ఫలితాల కోసం అధికారిక వెబ్​సైట్ jeeadv.ac.in​ లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- హోం పేజ్​లో కనిపించే జేఈఈ అడ్వాన్స్​డ్​ 2023 రిజల్ట్​ లింక్​పై క్లిక్​ చేయండి.

JEE Advanced 2023 results link : స్టెప్​ 3:- మీ లాగిన్​ వివరాలు సమర్పించండి.

స్టెప్​ 4:- ఫలితాలు స్క్రీన్​పై డిస్​ప్లే అవుతాయి.

స్టెప్​ 5:- వాటిని చెక్​ చేసుకుని, డౌన్​లోడ్​ చేసుకోండి.

ఫలితాలతో పాటు పేపర్​ 1, పేపర్​ 2 ఫైనల్​ ఆన్సర్​ కీని సైతం విడుదల చేసింది ఐఐటి గువాహటి. అధికారిక వెబ్​సైట్​లో దానిని చెక్​ చేసుకోవచచు.

జేఈఈ అడ్వాన్స్​డ్​ గరిష్ఠ మార్కులు:- 360 (ప్రతి పేపర్​కు 180)

ఫిజిక్స్​ గరిష్ఠ మార్కులు:- 120 (ప్రతి పేపర్​కు 60)

కెమిస్ట్రీ గరిష్ఠ మార్కులు:- 120 (ప్రతి పేపర్​కు 60)

మాథ్స్​ గరిష్ఠ మార్కులు:- 120 (ప్రతి పేపర్​కు 60)

Whats_app_banner

సంబంధిత కథనం