JEE MAIN 2024 : రేపట్నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు, అభ్యర్థులకు ఎన్టీఏ కీలక సూచనలు-vijayawada jee main 2024 session 2 exams from april 4th instructions to students admit cards released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jee Main 2024 : రేపట్నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు, అభ్యర్థులకు ఎన్టీఏ కీలక సూచనలు

JEE MAIN 2024 : రేపట్నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు, అభ్యర్థులకు ఎన్టీఏ కీలక సూచనలు

Bandaru Satyaprasad HT Telugu
Apr 03, 2024 02:37 PM IST

JEE MAIN 2024 : రేపట్నుంచి జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అభ్యర్థులకు ఎన్టీఏ అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది.

 జేఈఈ మెయిన్ పరీక్షలు
జేఈఈ మెయిన్ పరీక్షలు

JEE MAIN 2024 :రేపటి నుంచి దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ సెషన్-2 (JEE MAIN-2 Exams 2024)పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ మెయిన్ పరీక్షకు వేల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసింది. ఏప్రిల్ 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్లను(JEE MAIN-2 Admit Cards) అందుబాటులో ఉంచింది. అభ్యర్థులను పరీక్ష సమయానికి రెండు గంటల ముందుగా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. జేఈఈ మెయిన్ ను ఇంగ్లిషుతో పాటు ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. తెలుగు, ఉర్దూలో కూడా పరీక్ష రాయవచ్చు. ఈ పరీక్షల నేపథ్యంలో ఎన్టీఏ కీలక సూచనలు చేసింది.

జేఈఈ మెయిన్ అభ్యర్థులకు సూచనలు(JEE MAIN-2 Exams Instructions)

  • రెండు షిఫ్టుల్లో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో షిఫ్ట్ 3 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. వికలాంగులకు అదనంగా మరో గంట కేటాయిస్తారు.
  • ఎన్టీఏ వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్ ఉంటేనే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.
  • అభ్యర్థులు ధృవీకరణకు ఫొటో ఉన్న గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌ పోర్ట్, రేషన్ కార్డ్, 12వ తరగతి అడ్మిట్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్‌ వీటిల్లో ఏదైనా ఒకటి గుర్తింపు కార్డుగా తీసుకెళ్లాలి.
  • అభ్యర్థులు అటెండెన్స్ షీట్ లో ఫొటో అతికించాలి కాబట్టి పాస్‌పోర్టు సైజు ఫొటో తీసుకెళ్లాలి. దీంతో పాటు బాల్ పాయింట్ పెన్ను తీసుకెళ్లాలి.
  • వికలాంగ అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన వైద్యులు ధృవీకరించిన సర్టిఫికేట్ వెంట తీసుకెళ్లాలి.
  • పరీక్ష కేంద్రానికి రెండు గంటల ముందుగా రావాలి. అభ్యర్థులకు పరీక్షకు సంబంధించిన సమస్యలు ఉండే ముందుగా ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్ లేదా ఇన్విజిలేటర్‌కు తెలియజేయాలి.
  • పరీక్ష సమయంలో ఇచ్చిన రఫ్ షీట్లపైనే రఫ్ చేయాలి. వాటిని తిరిగి ఇన్విజిలేటర్‌కు అప్పగించాలి.
  • అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానికి పరికరాలు తీసుకురాకూడదు.

జేఈఈ మెయిన్​సెషన్-2 అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు jeemain.nta.ac.in వెబ్​సైట్​ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

జేఈఈ మెయిన్-2 అడ్మిట్ కార్డు డౌన్​లోడ్​ఎలా?(JEE Main Hall Tickets)

Step 1 - అభ్యర్థులు జేఈఈ వెబ్ సైట్ jeemain.nta.ac.in పై క్లిక్ చేయండి.

Step 2 - హోమ్ పేజీలో జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ 2024 పై క్లిక్ చేయండి.

Step 3 - కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థుల తమ వివరాలను నమోదు చేయాలి.

Step 4 - ఆ తర్వాత సబ్మిట్ బటన్​పై క్లిక్ చేసి అడ్మిట్ కార్డు డౌన్​లోడ్ చేసుకోండి.

Step 5 - తదుపరి అవసరాల కోసం అడ్మిట్​ కార్డును ప్రింట్ తీసుకోండి.

సంబంధిత కథనం