JEE Main 2024 session 2: రేపు ఓపెన్ కానున్న జేఈఈ మెయిన్ సెషన్ 2 అప్లికేషన్ కరెక్షన్ విండో-jee main 2024 session 2 application correction window opens tomorrow ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Main 2024 Session 2: రేపు ఓపెన్ కానున్న జేఈఈ మెయిన్ సెషన్ 2 అప్లికేషన్ కరెక్షన్ విండో

JEE Main 2024 session 2: రేపు ఓపెన్ కానున్న జేఈఈ మెయిన్ సెషన్ 2 అప్లికేషన్ కరెక్షన్ విండో

HT Telugu Desk HT Telugu
Mar 05, 2024 06:16 PM IST

JEE Main 2024 session 2: జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 కి అప్లై చేసుకున్న విద్యార్థులు తమ అప్లికేషన్ లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే, మార్చి 6, 7 తేదీల్లో వారికి ఆ అవకాశం లభిస్తుంది. జేఈఈ మెయిన్ సెషన్ 2 అప్లికేషన్ కరెక్షన్ విండో రేపు ఓపెన్ అవుతోంది.

జేఈఈ మెయిన్ సెషన్ 2 కరెక్షన్ విండో
జేఈఈ మెయిన్ సెషన్ 2 కరెక్షన్ విండో

JEE Main 2024 session 2: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ 2024 రెండో సెషన్ దరఖాస్తు గడువు మార్చి 4వ తేదీతో ముగిసింది. దరఖాస్తు విండో మార్చి 4 రాత్రి 10:50 గంటలకు, ఫీజు చెల్లింపు విండో రాత్రి 11:50 గంటలకు ముగిసింది.

కరెక్షన్ విండో

జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 (JEE Main 2024 session 2) అప్లికేషన్ కరెక్షన్ సదుపాయం 2024 మార్చి 6 నుంచి 7 వరకు అందుబాటులో ఉంటుంది. అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్, అడ్మిట్ కార్డులు, ఫలితాలను వెల్లడించే తేదీలను తర్వాత ప్రకటిస్తారు. జేఈఈ మెయిన్ సెషన్ 2 కి సెషన్ 1 కి అప్లై చేసి, పరీక్ష రాసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. జేఈఈ (మెయిన్) - 2024 సెషన్ 2 కోసం దరఖాస్తు / దిద్దుబాటుకు తదుపరి అవకాశం ఇవ్వనందున అభ్యర్థులు ఈ అవకాశాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని ఎన్టీఏ తన నోటిఫికేషన్లో పేర్కొంది.

జనవరి లో సెషన్ 1

జేఈఈ మెయిన్ 2024 మొదటి సెషన్ పరీక్షలను ఎన్టీఏ జనవరి-ఫిబ్రవరిలో నిర్వహించింది. పేపర్ 1 ఫలితాలను కూడా ప్రకటించింది. పేపర్-2 ఫలితాలు రావాల్సి ఉంది. సెషన్ 1 ఫలితాలను ప్రకటించారు. కానీ, అఖిల భారత ర్యాంకులను ఎన్టీఏ ప్రకటించలేదు. జేఈఈ మెయిన్ సెషన్ 2 (JEE Main 2024 session 2) పరీక్ష కూడా పూర్తయిన తరువాత, మొత్తం రెండు సెషన్లలో ఉత్తీర్ణతను పరిగణనలోకి తీసుకుని ఆల్ ఇండియా ర్యాంక్ లను ప్రకటిస్తారు. రెండు సెషన్లలోనూ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు.. ఏ సెషన్ లో అత్యుత్తమ స్కోర్ వస్తుందో, ఆ సెషన్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటారు. జేఈఈ మెయిన్ 2024 రెండో సెషన్ ఏప్రిల్ 4 నుంచి 15 వరకు జరగనుంది.

IPL_Entry_Point