JEE Mains 2024 : నేటితో ముగియనున్న జేఈఈ మెయిన్స్​ సెషన్​ 2 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ..-jee mains 2024 exam session 2 registration process ends tomorrow ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Mains 2024 : నేటితో ముగియనున్న జేఈఈ మెయిన్స్​ సెషన్​ 2 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ..

JEE Mains 2024 : నేటితో ముగియనున్న జేఈఈ మెయిన్స్​ సెషన్​ 2 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ..

Sharath Chitturi HT Telugu
Published Mar 02, 2024 06:40 AM IST

JEE Mains 2024 Exam Session 2 registration date : విద్యార్థులకు అలర్ట్​! జేఈఈ మెయిన్స్​ సెషన్​ 2 పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్​ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇలా అప్లై చేసుకోండి..

నేటితో ముగియనున్న జేఈఈ మెయిన్స్​ సెషన్​ 2 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ..
నేటితో ముగియనున్న జేఈఈ మెయిన్స్​ సెషన్​ 2 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ..

JEE Mains 2024 Exam Session 2 registration : జేఈఈ మెయిన్స్​ 2024 సెషన్​ 2 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ నేటితో (మార్చ్​ 2) ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు.. jeemain.nta.ac.in అధికారిక వెబ్​సైట్​ ద్వారా ఆన్​లైన్​లో రిజిస్టర్​ చేసుకోవాల్సి ఉంటుంది.

సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్​ను ఈ నెల మూడో వారంలో విడుదల చేస్తామని, పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డులను డౌన్​లోడ్ చేసుకోవచ్చని ఎన్​టీఏ (నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ) తెలిపింది.

జేఈఈ మెయిన్స్​ సెషన్​ 2 పరీక్షను.. 2024 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్స్ 2024 రెండో సెషన్ ఫలితాలు ఏప్రిల్ 25న విడుదల అవుతాయి.

JEE Mains 2024 Exam Session 2 date : జేఈఈ మెయిన్స్ 2024 పరీక్ష సెషన్ 2 దరఖాస్తు ఫీజు: పేపర్ 1 లేదా పేపర్ 2 దరఖాస్తు ఫీజు.. పురుషులకు రూ .1000, మహిళా అభ్యర్థులకు రూ .800. జనరల్ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ (ఎన్సీఎల్) కేటగిరీ పురుష అభ్యర్థులకు రూ.900, మహిళా అభ్యర్థులకు రూ.800 ఫీజు. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు, మహిళా కేటగిరీ అభ్యర్థుల దరఖాస్తు ఫీజు రూ.500.

జేఈఈ మెయిన్స్ 2024 పరీక్ష సెషన్ 2 డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

జేఈఈ మెయిన్స్ 2024 ఎగ్జామ్ సెషన్ 2: ఇలా అప్లై చేసుకోండి..

స్టెప్​ 1:- jeemain.nta.ac.in జేఈఈ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- హోమ్ పేజీలోని జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ 2024 సెషన్ 2 లింక్​పై క్లిక్ చేయండి.

JEE Mains 2024 Exam date Session 2 స్టెప్​ 3:- రిజిస్ట్రేషన్​ చేసుకుని అకౌంట్​లోకి లాగిన్​ అవ్వండి.

స్టెప్​ 4:- అప్లికేషన్ ఫామ్ నింపి.. వివరాలను చెక్​ చేసుకోండి.

స్టెప్​ 5:- ఆ తర్వత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

స్టెప్​ 6:- సబ్మిట్ బటన్​పై క్లిక్ చేస్తే.. రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తవుతుంది.

స్టెప్​ 7:- సంబంధిత పేజీని డౌన్​లోడ్ చేసుకోండి.

స్టెప్​ 8:- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.

జేఈఈ మెయిన్స్​ సెషన్​ 1 ఫలితాలు..

JEE Mains 2024 session 2 : జేఈఈ మెయిన్స్​ 2024 మొదటి సెషన్ జనవరి 24, 27, 29, 30, 31, ఫిబ్రవరి 1న జరిగింది. జేఈఈ మెయిన్స్ రెండు పేపర్లకు కలిపి మొత్తం 12,31,874 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 11,70,036 మంది పరీక్ష రాశారు. ఇక మెయిన్స్ 2024 సెషన్ ఫలితాలను ఫిబ్రవరి 12న విడుదల చేసింది ఎన్​టీఏ.

విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు ఏడాదికి రెండుసార్లు జేఈఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఇందులో పాసైన వారు.. జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్షకు అర్హత సాధిస్తారు. అందులో మంచి ర్యాంక్​ సంపాదించుకున్న విద్యార్థులు.. ఐఐటీలు, ఎన్​ఐటీల్లో సీట్లు దక్కించుకుంటారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.