NTA exam calendar : 2024 జేఈఈ మెయిన్, నీట్ పరీక్షల తేదీని ప్రకటించిన ఎన్టీఏ
NTA exam calendar : జేఈఈ, నీట్‌తో పాటు ఇతర ముఖ్యమైన పరీక్షల తేదీలను తాజాగా ప్రకటించింది ఎన్టీఏ. ఆ వివరాలు..
NTA Exam Calendar 2024 : 2024 ఏడాదిలో జరిగే వివిధ పరీక్షలకు సంబంధించిన తేదీలను మంగళవారం ఉదయం ప్రకటించింది ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ). జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష జనవరి- ఫిబ్రవరిలో జరగనుంది. ఇక రెండో సెషన్ ఏప్రిల్‌లో నిర్వహించనుంది ఎన్టీఏ. నీట్ 2024 పరీక్ష తేదీని కూడా వెల్లడించింది. ఆ వివరాలు..
వివిధ పరీక్షల ఎగ్జామ్ డేట్స్ ఇలా..
జేఈఈ మెయిన్ సెషన్ 1:- జనవరి 24- ఫిబ్రవరి 1.
జేఈఈ మెయిన్ సెషన్ 2:- ఏప్రిల్ 1- ఏప్రిల్ 15.
నీట్ యూజీ 2024:- మే 5.
NEET UG 2024 exam date : సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్) యూజీ:- మే 15- మే 31.
సీయూఈటీ పీజీ:- మార్చ్ 11 నుంచి మార్చ్ 28 వరకు.
యూజీసీ నెట్ 2023:- జూన్ 10 నుంచి జూన్ 21 వరకు.
ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు సంబంధించిన ఫలితాల వివరాలను ఎగ్జామ్ జరిగిన మూడు వారాలకు వెల్లడిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఆఫ్‌లైన్ పరీక్ష అయిన నీట్ యూజీ ఫలితాలు.. జూన్ రెండో వారంలో విడుదల చేస్తామని వెల్లడించింది.
ఎన్టీఏ.. ఈసారి చాలా తొందరగానే.. పరీక్షల తేదీలను ప్రకటించిందని చెప్పాలి. విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఉండేందుకు.. పరీక్షకు కొన్ని నెలల ముందే ముఖ్యమైన తేదీలను ప్రకటిస్తూ వస్తోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.
ముఖ్యమైన లింక్స్..
JEE Mains 2024 exam date : పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులు.. కొన్ని ముఖ్యమైన లింక్స్‌ను ఫాలో అవుతూ ఉండాలి. అవి..
- జేఈఈ మెయిన్ 2024: jeemain.nta.nic.in.
- నీట్ యూజీ 2024: neet.nta.nic.in.
- సీయూఈటీ యూజీ 2024: cuet.samarth.ac.in.
- సీయూఈటీ పీజీ 2024: cuet.nta.nic.in.
- యూజీసీ నెట్ 2024: ugcnet.nta.nic.in.
సంబంధిత కథనం