JEE Mains 2024 result : రేపు జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాలు- ఇలా చెక్ చేసుకోండి..
JEE Mains 2024 results date : జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 1కి సంబంధించిన ఫలితాలు సోమవారం వెలువడతాయని సమాచారం. రిజల్ట్స్‌ని ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
JEE Mains 2024 result : జేఈఈ మెయిన్స్ 2024 (జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్) సెషన్ 1 ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఓ కీలక వార్త బయటకి వచ్చింది. జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 1 ఫలితాలను ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ).. రేపు, అంటే సోమవారం విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారిక బ్రోచర్ ప్రకారం.. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాలు.. 2024 ఫిబ్రవరి 12న ప్రకటించనున్నట్టు ఉంది. ఎన్టీఏ.. ఫలితాలను ప్రకటించిన తర్వాత, విద్యార్థులు జేఈఈ మెయిన్స్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి (jeemain.nta.nic.in) ఫలితాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఫిబ్రవరి 9న జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ ఛాలెంజ్ విండోను ఎన్టీఏ మూసివేసింది. అభ్యంతరాలు తెలిపేందుకు ఫిబ్రవరి 8 చివరి తేదీగా ఉండగా, ఆ తర్వాత ఫిబ్రవరి 9కి మార్చింది. జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో పేపర్-1 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. పేపర్-2 పరీక్ష జనవరి 24న జరిగింది.
JEE Mains 2024 session 1 result date : ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ రెండు పేపర్లకు మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 11.70 లక్షల మంది పరీక్ష రాశారు.
జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితలను ఇలా చెక్ చేసుకోండి..
స్టెప్ 1:- ఎన్టీఏకి చెందిన జేఈఈ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in లోకి వెళ్లండి.
స్టెప్ 2:- హోమ్ పేజీలో.. ‘జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 1 రిజల్ట్’ అని కనిపించే యాక్టివేటెడ్ లింక్‌పై క్లిక్ చేయండి.
How to check JEE Mains 2024 results : స్టెప్ 3:- ఇప్పుడు.. మీ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీని వివరాలను ఎంటర్ చేసి సబ్మీట్ చేయండి.
స్టెప్ 4:- జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 1 ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిని చూసుకోండి.
స్టెప్ 5:- స్క్రీన్‌పై కనిపించే ఫలితాలను డౌన్లోడ్ చేసుకోండి.
జేఈఈ మెయిన్స్ తర్వాత ఏంటి?
JEE Mains 2024 : దేశంలోని ప్రముఖ ఐఐటీలు, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ విద్య కోసం నిర్వహించేదే ఈ జేఈఈ. కాగా.. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. మొదటిది.. జేఈఈ మెయన్స్. రెండోది జేఈఈ అడ్వాన్స్డ్. జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు.. అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధిస్తారు. అందులో కూడా పాసై, మంచి ర్యాంక్ తెచ్చుకోగలిగితే.. ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్ వస్తుంది.
సంబంధిత కథనం