AP Paramedical Admissions : పారామెడికల్, బీపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ - ముఖ్య తేదీలివే
AP Paramedical Courses : పారామెడికల్, బీపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆన్ లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్లను స్వీకరిస్తారు.
రాష్ట్రంలో బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తులకు దాఖలు చేసేందుకు డిసెంబర్ 9వ తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు ఆన్‌లైన్‌లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌టీఆర్ హెల్త్ సైన్సెస్ యూనివర్శిటీ అనుబంధ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు.
అర్హతలు…
రెండేళ్ల ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ) పూర్తి చేయాలి. లేదంటే 10+2 సీబీఎస్‌సీ, ఏఐఎస్ఎస్‌సీఈ, ఐసీఎస్ఈ, ఎస్ఎస్‌సీఈ, హెచ్ఎస్‌సీఈ, ఎన్ఐఓఎస్, ఏపీఓఎస్ఎస్‌లలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేయాలి. బ్రిడ్జి కోర్సు బయోలజీ, ఫిజిక్స్‌లతో కలిపి ఇంటర్మీడియట్ ఒకేషనల్ పూర్తి చేయాలి. ఇంగ్లీష్ తప్పని సరి సబ్జెక్ట్
వయో పరిమితి
1. అభ్యర్థి 2024 డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్ల పూర్తి చేసుకోవాలి. 17 ఏళ్లు పూర్తి కాకపోతే అర్హులు కారు.
2. పదో తరగతి సర్టిఫికేట్‌లో నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా చూస్తారు.
3. 17 ఏళ్లు పైబడిన తరువాత వయస్సు పరిమితి ఏమీ లేదు.
4. దివ్యాంగు అభ్యర్థులు మూడు నెలలకు తక్కువ లేకుండా తీసుకున్న సర్టిఫికేట్ దరఖాస్తు చేసేటప్పుడు అప్లోడ్ చేయాలి.
యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ https://apuhs-ugadmissions.aptonline.in/UGBPT/Home/StudentLogin ద్వారా దరఖాస్తు దాఖలు చేసుకోవచ్చు. దరఖాస్తు , ప్రొసెసింగ్ ఫీజు ఓసీ విద్యార్థులు రూ.2,360 (రూ.2,000 +360 (జీఎస్‌టీ 18 శాతం)), బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.1,888 (1,600+288 (జీఎస్‌టీ 18 శాతం)) చొప్పున రుసుం చెల్లించాలి. అభ్యర్థులు ఫీజును డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి వాటిద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
అప్ లోడ్ చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు
1. పదో తరగతి మార్కుల జాబితా (భర్త్ సర్టిఫికేట్)
2. ఇంటర్మీడియట్‌తో సహా ఇతర అర్హతలు గల మార్కుల జాబితా
3. 6 తరగతి నుంచి 10 తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు
4. ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్
5. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్
6. కుల ధ్రువీకరణ పత్రం
7. తల్లిదండ్రుల ఆదాయ సర్టిఫికేట్
8. రెసిడెన్సియల్ సర్టిఫికేట్ (ఏపీ, తెలంగాణ)
9. తల్లిదండ్రుల ఉద్యోగ సర్టిఫికేట్
10. ఆధార్ కార్డు
11. మైనార్టీ సర్టిఫికేట్
12. దివ్యాంగు సర్టిఫికేట్
13. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ (ఏపీ, తెలంగాణ)
14. అభ్యర్థి ఫోటో
15. అభ్యర్థి సంతకం
ఈ ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఫోటో, సంతకం స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేటప్పుడు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. దరఖాస్తు చేసేటప్పుడు ఏదైనా సమస్య వస్తే 8978780501, 7997710168 ఫోన్ నెంబర్లకు సంప్రదిస్తే, నివృత్తి చేస్తారు. అలాగే టెక్నికల్, పేమెంట్ సమస్యలు తలెత్తితే 9000780707, 8008250842లను సంప్రదించాలని ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్శిటీ రిజిస్ట్రర్ వి. రాధిక రెడ్డి తెలిపారు.