JEE Main 2024 Results: జేఈఈ మెయిన్ పరీక్షలో 100 ఎన్టీఏ స్కోరు సాధించిన విద్యార్థుల్లో తెలంగాణ టాప్-jee main 2024 results 23 students including 7 in telangana scored 100 nta score in session 1 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Main 2024 Results: జేఈఈ మెయిన్ పరీక్షలో 100 ఎన్టీఏ స్కోరు సాధించిన విద్యార్థుల్లో తెలంగాణ టాప్

JEE Main 2024 Results: జేఈఈ మెయిన్ పరీక్షలో 100 ఎన్టీఏ స్కోరు సాధించిన విద్యార్థుల్లో తెలంగాణ టాప్

HT Telugu Desk HT Telugu
Feb 13, 2024 03:11 PM IST

JEE Main 2024 Results: జేఈఈ మెయన్ 2024 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మరోసారి సత్తా చూపారు. తెలంగాణకు చెందిన ఏడుగురు విద్యార్థులు 100 ఎన్టీఏ సాధించి రికార్డ్ సృష్టించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT FIle)

7 in Telangana scored 100 NTA score in JEE MAIN 2024: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం ప్రకటించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ లేదా జేఈఈ (మెయిన్) సెషన్ 1 పరీక్ష 2024లో 23 మంది అభ్యర్థులు పూర్తి స్కోర్ అంటే ఎన్టీఏ 100 స్కోర్ సాధించారు. కాగా, 100 ఎన్టీఏ స్కోర్ సాధించిన వారిలో మహిళలు ఎవరూ లేరు. మహిళా అభ్యర్థుల్లో గుజరాత్ కు చెందిన ద్విజా ధర్మేష్ కుమార్ పటేల్ 99.99 ఎన్ టీఏ స్కోరుతో అగ్రస్థానంలో నిలిచారు.

టాపర్లు వీరే..

జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 ఫలితాల్లో హర్యానాకు చెందిన ఆరవ్ భట్, తెలంగాణకు చెందిన రిషి శేఖర్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ కు చెందిన షేక్ సూరజ్, తమిళనాడుకు చెందిన ముకుంత్ ప్రతిష్ ఎస్, ఢిల్లీకి చెందిన మాధవ్ బన్సాల్ ఈ ఏడాది టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ఈ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం..

నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇతర కేంద్ర నిధులతో నడిచే సాంకేతిక కళాశాలల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహిస్తుంది. దీని స్కోరు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ (అడ్వాన్స్డ్) పరీక్షలకు అర్హత ప్రమాణంగా పనిచేస్తుంది. జేఈఈ మెయిన్ 2024 మెయిన్ సెషన్ 1, సెషన్ 2 ఫలితాల అనంతరం ఫైనల్ ర్యాంక్ లను ప్రకటిస్తారు.

తెలంగాణ నుంచి ఏడుగురు..

జేఈఈ మెయిన్ 2024 పరీక్షలో తెలంగాణ విద్యార్థుల్లో ఏడుగురు 100 ఎన్టీఏ స్కోర్ సాధించారు. గిరీల వారీగా టాపర్ల జాబితా ప్రకారం రాష్ట్రం నుంచి 10 మంది విద్యార్థులు టాపర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ పరీక్ష రాసిన వారిలో కేవలం 23 మంది విద్యార్థులు మాత్రమే 100 ఎన్టీఏ స్కోర్ సాధించారు. పూర్తి స్కోర్ సాధించిన 23 మంది విద్యార్థుల్లో 19 మంది జనరల్ కేటగిరీకి చెందినవారు కాగా, నలుగురు ఇతర వెనుకబడిన తరగతుల (OBC) విద్యార్థులు ఉన్నారని ఎన్టీఏ తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గం (EWS)కు చెందిన ఇద్దరు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన ఒక్కొక్కరు 99.99 ఎన్టీఏ స్కోరు సాధించారు. మార్కుల శాతంతో సమానంగా స్కోర్లు లేవని ఎన్టీఏ తెలిపింది. వీటిని మల్టీ సెషన్ పేపర్లలో నార్మలైజ్ చేస్తారు. ఒకే సెషన్లో పరీక్షకు హాజరైన వారందరి సగటు ఫలితాల ఆధారంగా ఈ స్కోర్స్ ను రూపొందించారు. వచ్చిన మార్కులను ప్రతి సెషన్ పరీక్షకు 100 నుంచి 0 వరకు స్కేల్ గా మారుస్తారు.

జనవరి 24 నుంచి..

జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగింది. సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 15 వరకు జరుగుతాయి. జేఈఈ మెయిన్స్ సెషన్-1 కోసం 400937 మంది మహిళలు, 9 మంది థర్డ్ జెండర్ వ్యక్తులు సహా 12,21,624 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 11,70,048 అంటే 95.8 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎన్టీఏ పరీక్ష నిర్వహించడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంవత్సరం తొలి సేషన్ లోనే అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పరీక్ష రాశారు.

13 భాషల్లో..

జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షను మనామా, దోహా, దుబాయ్, ఖాట్మండు, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్, కువైట్ సిటీ, కౌలాలంపూర్, లాగోస్/ అబుజా, కొలంబో, జకార్తా, మాస్కో, ఒట్టావా, పోర్ట్ లూయిస్, బ్యాంకాక్, వాషింగ్టన్ డీసీ సహా 291 నగరాల్లోని 544 కేంద్రాల్లో నిర్వహించారు. అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ సహా 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహించారు. మొబైల్ నెట్ వర్క్ ల ద్వారా మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని కేంద్రాల్లో జామర్లు ఏర్పాటు చేసి పరీక్ష సమయంలో అభ్యర్థులు మొబైల్ లేదా మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా అక్రమాలకు పాల్పడకుండా చర్యలు తీసుకున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో తొలిసారిగా 5జీ జామర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

Whats_app_banner