జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలు విడుదల.. jeemain.nta.ac.in వద్ద ఫలితాలను ఎలా తనిఖీ చేయాలో తెలుసుకోండి
జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ 2024 సెషన్ ఫలితాలను ఫిబ్రవరి 12న విడుదల చేసింది. జేఈఈ మెయిన్ 2024 సెషన్ వన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు jeemain.nta.ac.in అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి జేఈఈ మెయిన్ 2024 సెషన్ వన్ ఫలితాన్ని తెలుసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ 2024 స్కోర్‌కార్డ్ లింక్
జేఈఈ మెయిన్ 2024 మొదటి సెషన్ జనవరి 24, 27, 29, 30, 31, ఫిబ్రవరి 1న జరిగింది. తొలిరోజు బీఆర్క్, బీప్లానింగ్ (పేపర్-2) పరీక్ష నిర్వహించారు. మిగిలిన అన్ని రోజుల్లో బీఈ/బీటెక్ (పేపర్-1) పరీక్ష నిర్వహించారు. జేఈఈ మెయిన్స్ రెండు పేపర్లకు కలిపి మొత్తం 12,31,874 మంది రిజిస్టర్ చేసుకోగా, వారిలో 11,70,036 మంది పరీక్ష రాశారు.
జేఈఈ మెయిన్ 2024 సెషన్ వన్ రిజల్ట్: ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి
jeemain.nta.ac.in అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.
హోమ్ పేజీలో, సెషన్ వన్ రిజల్ట్ పై క్లిక్ చేయండి
మీ అప్లికేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీతో లాగిన్ అవ్వండి.
ఫలితాలను తనిఖీ చేసుకోండి. భవిష్యత్తు రిఫరెన్స్ కోసం వాటిని ప్రింట్ తీసుకోండి.
పరీక్షకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని కూడా ఇప్పటికే విడుదల చేశారు. పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఫిబ్రవరి 6న విడుదల చేయగా, అభ్యంతరాలు తెలిపేందుకు ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు గడువు ఇచ్చారు. వారి ఫీడ్ బ్యాక్ ను సమీక్షించిన ఎన్ టీఏ ఫైనల్ ఆన్సర్ కీని సిద్ధం చేసింది.
సెషన్ 2 పరీక్ష ముగిసిన తర్వాత తుది ఫలితాల సమయంలో జేఈఈ మెయిన్ 2024 అఖిల భారత ర్యాంకులను ప్రకటిస్తారు.
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ ఐటీ), ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇతర భాగస్వామ్య సంస్థలు అందించే అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ , ఆర్కిటెక్చర్ , ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ లేదా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ నిర్వహిస్తారు.